టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల జాబితాను పరిశీలిస్తే అందులో రాజమౌళి, సుకుమార్ ముందువరసలో ఉంటారు.రాజమౌళి మాస్ సినిమాలను, గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉండే సినిమాలను తెరకెక్కిస్తుంటే ఒకప్పుడు క్లాస్ సినిమాలకు, వైవిధ్యంతో కూడిన సినిమాలను తెరకెక్కించిన సుకుమార్ ప్రస్తుతం తన సినిమాలలో హీరోలను మాస్ గా చూపించడానికి ఇష్టపడుతున్నారు.
ఆర్య సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన సుకుమార్ రెండో సినిమాగా జగడం సినిమాను తెరకెక్కించారు.
రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చినా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు.
రాజమౌళి, సుకుమార్ మంచి స్నేహితులు కాగా సుకుమార్ ఒక సందర్భంలో మాట్లాడుతూ జగడం సినిమా ఫ్లాప్ అయిన సమయంలో రాజమౌళి మాత్రమే తనను సపోర్ట్ చేశారని తెలిపారు.జగడం సినిమా ఫ్లాప్ కావడంతో నిరుత్సాహానికి గురైన తనకు రాజమౌళి తన కారులో తీసుకెళ్లి తిప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చారని సుకుమార్ పేర్కొన్నారు.
జగడం సినిమా రిలీజైన తరువాత తాను కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నానని పెద్ద డైరెక్టర్ అయిన రాజమౌళి తనను కారులో తీసుకెళ్లి సంతోషంగా అనిపించిందని సుకుమార్ పేర్కొన్నారు.సపోర్ట్ చేసి మాట్లాడటం రాజమౌళి గొప్పదనం అని సుకుమార్ వెల్లడించారు.ఒక ఇంటర్వ్యూలో సుకుమార్, రాజముళి పాల్గొనగా సుకుమార్ ఈ విషయాలను చెప్పారు.ఆ తరువాత ఆర్య సినిమా చూసిన సమయంలోనే తాను సుకుమార్ ను కాంపిటీటర్ అనుకున్నానని ఈ కాంపిటీటర్ ను ఫ్రెండ్ చేసుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని అనిపించిందని రాజమౌళి తెలిపారు.
ప్రస్తుతం సుకుమార్, రాజమౌళి పాన్ ఇండియా ప్రాజెక్టులు పుష్ప, ఆర్ఆర్ఆర్ తో బిజీగా ఉన్నారు.ఈ ఏడాదే ఈ రెండు సినిమాలు రిలీజ్ కావాల్సి ఉండగా ఈ ఇద్దరు డైరెక్టర్లలో ఏ డైరెక్టర్ సినిమా మొదట రిలీజవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.