వైరల్: భారత్ నా రెండో ఇల్లు అంటూ తెలుగులో పోస్ట్ చేసిన వార్నర్..!

డేవిడ్ వార్నర్ అంటే వెంటనే వినిపించే పేరు సన్ రైజర్స్ జట్టు.ఈ ఆటగాడు హైదరాబాద్ టీమ్ కు సారధ్యం వహించాడు.

 Viral: Warner Posted In Telugu That India Is My Second Home ..! Dawid Warner, Co-TeluguStop.com

ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు.అంతేకాదు డేవిడ్ వార్నర్ టాలీవుడు పాటలకు స్టెప్పులేసి ఫేమస్ అయ్యాడు కూడా.

ఆస్ట్రేలియా క్రికెటర్ అయిన వార్నర్ కు తెలుగు అభిమానులు చాలా మందే ఉన్నారు.ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ అంతగా తన సత్తా చాటలేకపోయాడు.

అయినా అతనికి ప్రేక్షకుల నుంచి అండ ఎప్పుడూ ఉండేది.ఆ మధ్య వరుస డైలాగులతో, డ్యాన్సు స్టెప్పులతో డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాను ఏలాడు.

అందుకే వార్నర్ ని అందరూ డేవిడ్ బాయ్ అని సంబోధిస్తారు.టిక్ టాక్ లో డేవిడ్ వీడియోలతో బాగా ఫేమస్ అయ్యాడు.

టాలీవుడ్ సినిమా హీరోల పాటలు మాత్రమే కాదు బాలీవుడ్ సినిమా హీరోల పాటలకు స్టెప్పులేసి ఇరగదీశాడు.ఇలా వీడియోల ద్వారా ఐపిఎల్ కు ముందు తెలుగు అభిమానులను మూటగట్టుకున్నాడు.

ఆయన కెప్టెన్ గా ఉన్నప్పుడు అనేక పరాభవాలను చవిచూడటం వల్ల ఆయనపై ఒత్తిడి ఎక్కువగా ఉండేది.దీంతో ఆయన తన కెప్టెన్సీని వదుకోవాల్సి వచ్చింది.సన్ రైజర్స్ టీమ్ వరుసగా అపజయాలను మూటగట్టుకోవడం వల్ల ఆయన కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.ప్రస్తుతం డేవిడ్ వార్నర్ మళ్లీ వార్తల్లో నిలిచాడు.

తన రెండవ ఇల్లు ఇండియానే అని నెట్టింట పోస్టు పెట్టాడు.

దీంతో వార్నర్ మరో సారి ఫేమస్ అయ్యాడు.ఇండియాలో తనకు ఇష్టమైన ప్రాంతంగా హైదరాబాద్ ను పేర్కొన్నాడు.ఇవన్నీ కూడా తెలుగులోనే చెప్పడంతో ఆ పోస్టు కాస్తా తెగ వైరల్ అవుతోంది.

ఈ పోస్టు పెట్టడమే కాదు ఆ పోస్టుకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పోస్టర్లను కూడా ట్యాగ్ చేశాడు.దీంతో డేవిడ్ వార్నర్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube