జాలర్లను కోటీశ్వరులను చేసిన తిమింగలం..!

ఒక్కోసారి అదృష్టం మనం తీసే దాకే తలుపు తడుతుంది.మనం వెతికేది మన కాలికే తలుగుతుంది.

 Yemen Fishermen Find Ambergris In Dead Whale, Ambergris , Dead, Find, Fishermen,-TeluguStop.com

అలాంటిదే పశ్చిమ యెమన్ మత్స్యారులకు అదృష్టం తలుపు తట్టింది.వేటకు వెళ్లిన వారికి సముద్రంలో మృత తిమింగల కళేబరం కనిపించింది.

తిమింగలం కడుపులో అంబగ్రిస్ అనే పదార్ధం ఉంటుందని వారికి తెలుసు.అది సుగంధ ద్రవ్యాల్లో, సెంట్ బాటిల్స్ లో వాడుతారు.

మార్కెట్ లో దాని విలువ అధికంగా ఉంటుంది.అందుకే ఆ తిమింగల కళేబరాన్ని తెచ్చి చూస్తే వారు ఊహించినట్టుగానే దాని కడుపులో అంబగ్రిస్ పదార్ధం ఉంది.

మాములుగా అయితే తిమింగల ఉమ్మివేసినప్పుడు.వాంతి చేసుకున్నప్పుడే ఈ పదార్ధం బయటకు వస్తుంది.

సుగంధ ద్రవ్యాల తయారీల్లో అంబగ్రిస్ కు భారీ డిమాండ్ ఉంది.దీనితో తయారు చేసే బాటిల్స్ చిన్న వాటికే లక్షల ఖరీదు ఉంటుంది.

యెమన్ జాలర్లకు పడిన తిమింగల కళెబరాన్ని కత్తులతో చీల్చి చూడగా దాని పొట్టలో అంబగ్రిస్ పదార్ధం ఉందని గుర్తించారు.దాన్ని మార్కెట్ వర్గాలకు చూపిస్తే దాదాపు దాని విలువ 10 కోట్ల దాకా చేస్తుందని చెప్పారు.

అంతే యెమన్ మత్స్యకారుల పంట పండినట్టు అయ్యింది.మొత్తం వేటకు 35 మంది జాలర్లు వెల్లగా ఆ మొత్తాన్ని వారే పంచుకుంటారని తెలుస్తుంది.

మొత్తానికి జాలర్ల జీవితంలో కొత్త ఆనందాన్ని తెచ్చింది తిమింగలం.అయితే అన్ని సమయాల్లో ఇలాంటి లక్ తగులుతుందని చెప్పడం కష్టమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube