ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ ప్రోగ్రాం గురించి తెలియని వారంటూ ఉండరు.ఈ షో ద్వారా చాలా మందికి జీవనోపాధి పొందుతున్నారు.
ఇక చాలా మంది కొరియోగ్రాఫర్స్ ని పరిచయం చేసింది.ఇక ఢీ షోలో స్టైలిష్ కంటెస్టెంట్ గా కన్పించి, ఇప్పుడు ఏకంగా ఓ డాన్స్ షోకి జడ్జిగా ఉన్న యస్వంత్ మాస్టర్ పూర్తిపేరు యాడారల్ యస్వంత్.
ఇక ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తిలో 1991జూన్ 5న జన్మించిన ఇతడికి 30 ఏళ్ళు పూర్తవు తున్నాయి.
అయితే యస్వంత్ తండ్రి ఓ ఆయుర్వేద డాక్టర్, తల్లి గృహిణి.
అనంతపురం రవీంద్ర భారతి స్కూల్లో 9వ తరగతి అయ్యాక కర్ణాటకకు ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వడంతో ఇక కర్ణాటకలోనే స్టడీస్ పూర్తి చేసాడు.ఎన్ఐటిటి ఈ కాలేజీలో ఎంబీఏ కంప్లిట్ చేసాడు.
యస్వంత్ కి 2019 ఏప్రిల్ 27న పెద్దల ఆశీర్వాదంతో వర్ష భవాని అనే అమ్మాయితో హైదరాబాద్ లో వివాహం జరిగింది.
ఇక చిన్నతనం నుంచి డాన్స్ అంటే ఇష్టం కావడంతో స్కూల్, కాలేజీ కల్చరల్ యాక్టివిటీస్ లో అతడి పేరు ముందు వరుసలో ఉండేది.
అలా చేసిన డాన్స్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో డాన్స్ షోకి ఆహ్వానం అందింది.అలా ఎదుగుతూ యస్వంత్ డాన్స్ ప్లస్ షోకి జడ్జిగా మారాడు.ఒక సాంగ్ కి కొరియోగ్రాఫ్ చేయడానికి యస్వంత్ 70వేల రూపాయల వరకూ తీసుకుంటాడు.
అయితే సమంత నటించిన యు టర్న్ మూవీకి కొరియోగ్రఫీ చేసినందుకు 2న్నర లక్షలు అందుకున్నాడు.
యస్వంత్ కి జూనియర్ ఎన్టీఆర్ ఫేవరేట్ హీరో.
ఫేవరేట్ హీరోయిన్ సమంత.ఇష్టమైన ప్రదేశం ముంబై.ఇతడి నెట్ వర్త్ రెండున్నర కోట్లు ఉంటుంది.
హైదరాబాద్ సాయికృప అపార్ట్ మెంట్స్ లో బి బ్లాక్ లో నివాసం ఉంటున్న ఇతడికి స్కోడా రాపిడ్ కారు, ఖరీదైన బైక్ ఉన్నాయి.ఆయన సాయి ధరమ్ తేజ్ సినిమాలో ఒక్క పాటకి కొరియోగ్రాఫ్ చేశారు.