ప్రస్తుతం కరోనా పెద్ద ఎత్తున విజ్రుంభిస్తున్న నేపథ్యంలో చాలా వరకు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి.ఎందుకంటే కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ఇక ప్రభుత్వాలు సైతం అదుపు చేయలేని పరిస్థితులలో లాక్ డౌన్ ను విధించాయి.
దీంతో అన్ని రకాల కార్యక్రమాలపై నిబంధనలు విధించింది ప్రభుత్వం.అందులో ముఖ్యంగా ఈ సమయంలో ఎక్కువగా వివాహాలు జరుగుతాయి.
అయితే కరోనా దృష్ట్యా వరుడు తరుపున 25 మంది, వధువు తరపున 25 మందితో మాత్రమే పెళ్లి వేడుకను నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది.అయితే ప్రభుత్వం ఇంతలా చెబుతున్నా యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించే వారు ఉల్లంఘిస్తూనే ఉన్నారు.
దీంతో పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా.
నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి వేడుకను నిర్వహించిన సదరు కుటుంబ సభ్యులపై, పెళ్ళికి వచ్చిన బంధువులపై పోలీసులు విధించిన శిక్ష ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.మామూలుగా అయితే పెళ్లి వేడుకను నిర్వహించిన కీలక వ్యక్తులపై కేసు నమోదు చేస్తారు, కాని ఈ ఘటనలో ఏకంగా పెళ్ళికి వచ్చిన బంధువులను కుప్పిగంతులు వేయించి వినూత్న శిక్షను విధించారు.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.నెటిజన్లు పోలీసులను అభినందిస్తున్నారు.కరోనాతో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతుంటే ఏ మాత్రం భయం లేకుండా ఇలా ప్రవర్తించడమేంటని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.నెటిజన్లను ఎంతో ఆసక్తికి గురి చేసిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.
ఇంకెందుకు ఆలస్యం.చూసేయండి మరి.