సినిమా రంగంలో కొన్ని చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఒక డైరెక్టర్, ఒక హీరో కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ అయితే చాలు.
అదే డైరెక్టర్, అదే హీరో కలిసి మరో సినిమా చేస్తారు.అయితే మొదటిసారి హిట్ అయినా.
రెండో సారి చేసిన సినిమాలు ఫ్లాప్ కావడం విశేషం.అలా దెబ్బకొట్టిన సినిమాలు టాలీవుడ్ లో చాలా వున్నాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏంటి? ఆ డైరెక్టర్, హీరోల కాబినేషన్ ఏది? అనేది ఇప్పుడు చూద్దాం.
వివి వినాయక్.జూనియర్ ఎన్టీఆర్
వీరిద్దరిక కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ఆది సూపర్ హిట్ అయ్యింది.వెంటనే ఇద్దరు కలిసి సాంబ సినిమా తీశారు.అది ఘోర పరాజయం పాలైంది.
త్రివిక్రమ్.మహేష్ బాబు
ఇద్దరు కలిసి అతడు సినిమా తీశారు.సూపర్ హిట్ అయ్యింది.మళ్లీ ఇద్దరు కలిసి ఖలేజా సినిమా తీశారు.అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
సురేందర్ రెడ్డి.రవితేజ
ఈ ఇద్దరు కలిసి కిక్ సినిమా తీశారు.బంఫర్ హిట్ అయ్యింది.వెంటనే కిక్ 2 సినిమా తీశారు.డిజాస్టర్ గా నిలిచింది.
సుకుమార్.అల్లు అర్జున్
సుకుమార్, అల్లు అర్జున్ కలిసి ఆర్య సినిమా తీసి సూపర్ సక్సెస్ అయ్యారు.వెంటనే ఆర్య-2 తీశారు.ఫ్లాప్ అయ్యింది.
శ్రీను వైట్ల.మహేష్ బాబు
ఈ ఇద్దరి కాంబినేషన్ లో దూకుడు సినిమా వచ్చింది.మంచి హిట్ అయ్యింది.వెంటనే ఆగడు సినిమా చేసి ఆగం అయ్యారు.
శ్రీకాంత్ అడ్డాల.మహేష్ బాబు
ఇద్దరు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తీశారు.మంచి విజయం సాధించారు.వెంటనే బ్రహ్మోత్సవం తీసి పరాజయం పాలయ్యారు.
ఎస్ జె సూర్య.పవన్ కల్యాణ్
వీరిద్దరి కాంబినేషన్ లో ఖుషి సినిమా వచ్చి ఇండస్ట్రీ హిట్ సాధించింది.ఆ తర్వాత వచ్చిన కొమురం పులి సినిమా పరాజయం పాలైంది.
లారెన్స్.నాగార్జున
ఈ కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా మాస్ హిట్ అయ్యింది.రెండో సినిమా డాన్ ఫ్లాప్ అయ్యింది.
పూరీ జగన్నాథ్.పవన్ కల్యాణ్
వీరిద్దరు కలిసి తీసిన తొలి సినిమా బద్రీ హిట్ అయ్యింది.రెండో సినిమా కెమెరా మెన్ గంగతో రాంబాబు మూవీ ఫ్లాప్ అయ్యింది.
పూరీ జగన్నాథ్.నాగార్జున
వీరిద్దరు కాబినేషన్ లో వచ్చిన శివమణి సినిమా మంచి విజయం సాధించగా. సూపర్ సినిమా ఫ్లాప్ అయ్యింది.
చందు.నాగా చైతన్య
వీరిద్దరు కలిసి ప్రేమమ్ సినిమా తీసి హిట్ కొట్టారు.రెండో సినిమా సవ్యసాచి చాచి చెంపమీద కొట్టింది.