టాలీవుడ్ స్టార్ యాంకర్ లాస్య గత కొన్ని నెలల నుంచి షోలు, ఈవెంట్లతో బిజీగా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు.బిగ్ బాస్ సీజన్ 4తో మంచి గుర్తింపును సంపాదించుకున్న లాస్య సెకండ్ ఇన్నింగ్స్ లో యాంకర్ గా కాకుండా కామెడీ స్కిట్ల ద్వారా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
స్టార్ మా ఛానెల్ లో రవిలాస్య కలిసి చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి.అయితే తాజాగా లాస్య గ్రాండ్ పార్టీ ఇచ్చారు.
తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లతో పాటు కామెడీ స్టార్స్ షోలో పాల్గొనే కమెడియన్లను ఆమె పార్టీకి పిలిచారు.మోనాల్, అఖిల్, సోహైల్ తో పాటు పలువురు బిగ్ బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు.
లాస్య సోషల్ మీడియా వేదికగా జున్ను పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.కొడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ జున్ను తన లక్ అని లాస్య పేర్కొన్నారు.
తన కొడుకు ఎప్పుడూ ఇదే విధంగా నవ్వుతూ ఉండాలని.బ్లెస్ యు బేటా అంటూ లాస్య అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.లాస్య కొడుకు నిక్ నేమ్ జున్ను కాగా దక్ష్ అని కొడుకుకు నామకరణం చేసినట్టు లాస్య వెల్లడించారు.లాస్యది లవ్ మ్యారేజ్ కాగా 2010 సంవత్సరంలోనే ఆమె రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
కొన్ని సంవత్సరాల పాటు ఆ విషయాన్ని దాచిపెట్టిన లాస్య పెద్దలను ఒప్పించి 2017లో మరోసారి మంజునాథ్ ను వివాహం చేసుకున్నారు.
కొడుకు పుట్టిన తర్వాత తన జీవితమే మారిపోయిందని లాస్య పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
కెరీర్ తొలినాళ్లలో ఎన్నో కష్టాలు పడిన లాస్య ఆ తరువాత స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుని వరుస ఆఫర్లతో బిజీ అయ్యారు.