మన తెలుగు గడ్డపై సినిమాలు రాజకీయాల్లో సెంటిమెంట్లకు ఉండే ప్రాధాన్యతే వేరు.చాలా మంది సెంటిమెంట్లను నమ్ముకునే రాజకీయాలు చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే త్వరలోనే తెలంగాణలోని నాగార్జునా సాగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నికల్లోనూ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని తమదే గెలుపు అని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.దుబ్బాక సెంటిమెంట్ ప్రకారం చూస్తే సాగర్లోనూ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
దుబ్బాక ఉప ఎన్నికలకు ముందు జరిగిన సాధారణ ఎన్నికల్లో రఘునందన్ రావు ఓడిపోయారు.అయినా ఆయన ఉప ఎన్నికల్లో పోరాడి విజయం సాధించారు.
ఇక సాగర్లో కూడా జానారెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయారు.ఇప్పుడు సాగర్లోనూ ఆయనే మళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.ఒక వేళ ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్నది చెప్పలేం.అయితే కాంగ్రెస్ పెద్దల మాత్రం జానారెడ్డి అయితేనే సాగర్ సీటు గెలుచుకోవచ్చని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే జానారెడ్డి ఇక్కడ పోటీ చేస్తే దుబ్బాక సెంటిమెంట్ రిపీట్ అయితే ఖచ్చితంగా ఆయన గెలుస్తారని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సుజాత రెడ్డి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన వారే.ఇక ఇప్పుడు మళ్లీ బీజేపీ, టీఆర్ఎస్ పాత వాళ్లకు కాకుండా కొత్త వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలని చూస్తున్నాయి.ఇక జానారెడ్డి పోటీ చేస్తే సేమ్ దుబ్బాక ఎన్నికల్లో ఏం జరిగిందో అదే జరిగినట్టు అవుతుంది మరీ ఈ సెంటిమెంట్ ఎంత వరకు ఫలించి ఇక్కడ జానారెడ్డి గెలుస్తారో? అన్నది చూడాలి.