ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా అంటే మొట్టమొదటి నుండి అది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే జిల్లా అని చాలామంది చెబుతారు.రాయలసీమలో అన్ని జిల్లాలో వైసీపీ పార్టీ హవా కొనసాగితే ఈ జిల్లాలో మాత్రం తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతూ ఉంటది.
ఎటువంటి ఎన్నికలు వచ్చినా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రెపరెప లాడుతూ ఉంటుంది.అటువంటిది 2019 ఎన్నికలలో ఈ జిల్లాలో కేవలం రెండు స్థానాలు మాత్రమే టిడిపి కైవసం చేసుకోవడం జరిగింది.
జిల్లాలో టిడిపి ఎమ్మెల్యేలు గా నందమూరి బాలయ్య, పయ్యావుల కేశవ్ గెలవడం జరిగింది.
ఇటువంటి తరుణంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో జిల్లాలో టిడిపి పార్టీకి రెండు ఎమ్మెల్యేలు ఉన్నాగాని ఏకగ్రీవల విషయంలో….ఏ మాత్రం అధికారపార్టీకి… ఏకగ్రీవాలు అవ్వకుండా చాలావరకు అడ్డుకోవడం జరిగింది.కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం… ఏ మాత్రం అడ్డుకోలేక పోయారు.
వైసిపి పార్టీ బలపరిచిన అభ్యర్థులే చాలావరకు అనంతపురం జిల్లాలో విజయబావుటా ఎగరవేయడం జరిగింది.దీంతో రెండో విడత పంచాయతీ ఎన్నికలలో ఇటువంటి పరిస్థితి రాకుండా… అనంతపురం టిడిపి క్యాడర్ జాగ్రత్త పడుతుంది.
ప్రజా క్షేత్రంలో కూడా రాణించే విధంగా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.