అమ్మాయిగా పుట్టిన తరువాత అమ్మా అని పిలిపించుకోవడానికి ప్రతి తల్లి పరితపించిపోతుంది.ఆ పిలుపు కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది.
అమ్మ అవుతున్నా అని తెలిసిన దగ్గర నుండి ఆ తల్లి పడే ఆనందాన్ని మాటల్లో చెప్పలేము.ఇక సీమంతం సమయంలో ఆ గర్భిణీ మరింత సంబర పడిపోతుంది.
కడుపుతో ఉన్న మహిళకు సీమంతం చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది.అందరూ వచ్చి ఆ మహిళను అలంకరించి, పండు తాంబూలం తీసుకుని, అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే పండంటి బిడ్డ పుడుతుందని ఈ ఆనవాయితీని కొనసాగిస్తారు.
అయితే ఇటీవలే ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలోని ఓ ఇంట్లో కూడా ఇలానే సీమంతం చేసారు.చుట్టాలు, చుట్టు పక్కన వాళ్లు అందరు వచ్చారు.
వాళ్ళ రాకతో ఆ ఇంట్లో సందడి వాతావరణం మొదలైంది.ఇంటి ఇంటికి వెళ్లి బొట్టు పెట్టి శ్రీమంతం పిలుపు చెప్పారు.
అంగరంగ వైభవంగా శ్రీమంతం వేడుకలు జరిపారు.అయితే ఇక్కడ సీమంతం జరిగింది మాములు స్త్రీ కి కాదు.
ఈ వేడుక ఎవరికీ జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు.ఆ ఇంట్లో వాళ్లు ఎంతో ప్రేమతో పెంచుకునే వాళ్ళ పెంపుడు జంతువుకి.పెంపుడు జంతువు అంటే మరేదో అనుకోకండి.విశ్వాసానికి మారుపేరుగా నిలిచే శునకానికి ఆ ఇంటి సభ్యులు సీమంతం చేసారు.
పూర్తి వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న నూతక్కి నవ కుమార్,ఆశా దంపతులు ఏడాది క్రితం ఒక చిన్న కుక్క పిల్లను తెచ్చుకుని పెంచుకుంటున్నారు.ఈ దంపతులకు వీరికి మూగ జీవాలు అంటే ఇష్టం.
అందుకనే ఒక కుక్కను తెచ్చుకుని వాళ్ళ కన్న బిడ్డలా పెంచుకుంటున్నారు.అంతేకాకుండా ఆ పెంపుడు జంతువుకు స్టెఫీ అని ముద్దు పేరు కూడా పెట్టారు.
అయితే స్టెఫీ గర్భవతి అని తెలిసిన తరువాత దానికి సీమంతం చేయాలనీ భావించి అందరిని పిలిచి బేబీ షవర్ వేడుక చేసారు.
శుభకార్యానికి విచ్చేసిన ముత్తైదువులు ఆ స్టెఫీ కి అక్షింతలు వేసి, మంగళ హారతులు కూడా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం.అలాగే ఆ వీధిలో ఉండే అందరికీ కనువిందయిన బోజనాలు కూడా పెట్టారు.ఇంటి ముందు పందిరి వేసి, చక్కగా అలంకరించి, అందరిని పిలిచి, భోజనాలు పెట్టి మరీ పంపించారు.
వచ్చిన వాళ్లు ఆ వేడుకను చూసి పుడితే కుక్కలాగా ఎందుకు పుట్టలేదు అని అనుకునేలా సొంత ఆడపిల్లకి చేసిన అంతా ఘనంగా వేడుక చేసారు.నిజంగా కుక్క ఇంత ఘనంగా సీమంతం చేయడం విశేషం అని చెప్పాలి
.