ప్రతి వారిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది.అదే ముఖ్యంగా చిన్నపిల్లల్లో అయితే అద్భుతమైన టాలెంట్ ఉంటుంది.
కాని వారి టాలెంట్ ను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించి ప్రోత్సహిస్తే వారి టాలెంట్ ప్రపంచానికి తెలుస్తుంది.లేకపోతే సాధారణ స్టూడెంట్ లాగా వారు మిగిలిపోతారు.
అలా తల్లిదండ్రులు తమ పిల్లల టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహిస్తే సూపర్ స్టార్స్ అయిన వారు కోకొల్లలుగా ఉన్నారు.అలా వారి టాలెంట్ ను చూసి ప్రపంచం ఒక్కసారి నివ్వరపోయిన సంఘటనలు కూడా మనం చూసాం.
తాజాగా ఇలా వారి టాలెంట్ తో ఇద్దరు చిన్నారులు ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే బైజూస్ రెండవ ఎపిసోడ్ లో అశ్వతా బిజు, పూజా బిష్ణోయి అనే ఇద్దరు చిన్నారులు పాల్గొన్నారు.
మామూలుగా కార్యక్రమానికి హాజరైన ఈ చిన్నారుల సాధించిన రికార్డులు, వారికున్న లక్ష్యాలను చూసి ప్రపంచం గర్వపడుతోంది.పూజా బిష్ణోయి 3కిలో మీటర్ల పరుగు పందాన్ని 12.50 నిమిషాల్లో పూర్తి చేసి, అంతే కాక 10 కిలోమీటర్ల పరుగు పందాన్ని కేవలం 48 నిమిషాల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డ్ నెలకొల్పింది. ఒలంపిక్స్ లో భారతదేశానికి బంగారు పతకం తేవడమే తన లక్ష్యమని తెలిపింది.
ఇంకొక చిన్నారి అశ్వతా బిజు పాలియోoటాలజిస్ట్ గా గ్లోబల్ చైల్డ్ ప్రాడిజీని అందుకున్నారు.ఇలా వీరిద్దరి టాలెంట్ ను చూసి అందరూ సంతోషిస్తున్నారు
.