దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుందంటే ఆ సినిమా ఆలస్యంగా విడుదలైనా ఊహించని స్థాయిలో సక్సెస్ అవుతుందనే సంగతి తెలిసిందే.రాజమౌళి గత సినిమాల విషయంలో రిలీజ్ డేట్ ప్రకటించి ఆ తరువాత రిలీజ్ డేట్ ను మార్చడం జరిగింది.
అయితే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్లను ప్రకటించగా ఆ డేట్లకు సినిమా విడుదల కాలేదు.
రాజమౌళి ఈ సినిమాను మొదట 2020 సంవత్సరం జులై 30వ తేదీన విడుదల చేయాలని భావించారు.
అయితే వేర్వేరు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ తరువాత 2021 సంవత్సరం జనవరి 8వ తేదీకి రిలీజ్ డేట్ వాయిదా పడింది.అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ తేదీకి కూడా విడుదల చేయడం సాధ్యం కాకపోవడంతో రాజమౌళి తాజాగా అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ మూవీని విడుదల చేయాలని భావించారు.
అయితే రాజమౌళి ఫ్యాన్స్ తో పాటు చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ డేట్ కు సినిమా రిలీజ్ చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేయడానికి ముఖ్యమైన కారణమే ఉంది.ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు సంక్రాంతి లేదా సమ్మర్ మాత్రమే మంచి సీజన్ అని దసరా సమయంలో ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేస్తే ఆ ప్రభావం కలెక్షన్లపై పడే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాను వీలైతే 2021 సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
ఒకవేళ దసరా పండుగకే విడుదల చేయాలని భావిస్తే అక్టోబర్ 13న కాకుండా కొన్ని రోజుల ముందే విడుదల చేయాలని సూచిస్తున్నారు.మరి రాజమౌళి ఫ్యాన్స్ సూచనలను బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.