తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేటీఆర్ సీఎం అవటం గ్యారెంటీ అనే వార్తలు బాగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టి తెలంగాణలో పార్టీ పూర్తి బాధ్యతలను కేటీఆర్ చేతిలో పెట్టే విధంగా ఆలోచన చేస్తున్నట్లు తెలంగాణ రాజకీయవర్గాలలో ఎప్పటినుండో టాక్ ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ సీఎం కాబోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం జిల్లాలో నూతన పార్టీ కార్యాలయం ఓపెన్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
అనంతరం ప్రజాప్రతినిధులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.ఈసందర్భంగా కచ్చితంగా రాబోయే రోజుల్లో కేటీఆర్ సీఎం కాబోతున్నారని అందులో తిరుగు ఉండదని.
, కేసీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్కు అప్పగిస్తారు అనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదని కానీ పార్టీ నాయకుల మధ్య స్వల్ప విభేదాలు ఉన్నాయని సంచలన కామెంట్లు చేశారు.
ఇదే టైం లో వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ పార్టీ ఎదుగుదలకు తోడ్పడాలని పిలుపునిచ్చారు.
పార్టీ కార్యాలయం ఓపెనింగ్ లో జిల్లాకు చెందిన టిఆర్ఎస్ పార్టీ కీలక నేతలు కూడా హాజరయ్యారు.