గ్రీన్ టీ.నేటి కాలంలో పరిచయం అవసరం లేని పానియాల్లో ఇది ఒకటి.
అధిక బరువు తగ్గి ఫిట్‌గా ఉండేందుకు చాలా మంది గ్రీన్ టీని ఎంచుకుంటుంటారు.కేవలం బరువు తగ్గించడంలోనే కాదు.
బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించడంలోనూ గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.గ్రీన్ టీలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం, కాపర్, జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి గుండె జబ్బులను దూరం చేయడంలోనూ, మధుమేహం ముప్పు తగ్గించడంలోనూ, శరీర రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ, జ్ఞాపక శక్తిని మెరుగు పరచడంలోనూ ఇలా అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.అయితే గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.
అతిగా తీసుకుంటే మాత్రం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.ముఖ్యంగా, గ్రీన్ టీను మోతాదు మించి తీసుకోవడం వల్ల అందులోని కొన్ని పదార్థాలు శరీరంలోని న్యూట్రిషియన్స్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.
ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అలాగే చాలా మంది చేసే పొరపాటు.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీని సేవిస్తుంటారు.
కానీ, ఇలా ఖాళీ కడుపుతో గ్రీన్ టీని సేవిస్తే.అందులోని కెఫీన్, టానిన్స్ జీర్ణక్రియపై తీవ్రప్రభావం చూపి.గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడేలా చేస్తాయి.
ఇక రాత్రి సమయంలో కూడా గ్రీన్ టీని తీసుకోరాదు.ఎందుకంటే, గ్రీన్ టీ కొన్ని సమ్మేళనాలు నిద్రలేమికి దారి తీస్తాయి.
అందుకే గ్రీన్ టీని ఉదయం పూట తీసుకుంటే మంచింది.
అలాగే రోజుకు రెండు కప్పుల మించి గ్రీన్ టీని ఎప్పుడూ సేవించకూడదు.
అలా చేయడం వల్ల గ్రీన్ టీలోని టానిన్ అనే కంటెంట్ ఉంటుంది.ఇది ఉదరంలో ఎక్కువ యాసిడ్స్ ఉత్పత్తి అయ్యేలా ప్రేరేపిస్తుంది.
ఫలితంగా జీర్ణ సమస్యలు ఏర్పడతాయి.అదేవిధంగా, చాలా మంది ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత గ్రీన్ టీని తీసుకుంటుంటారు.
కానీ, ఎక్సర్‌సైజ్ చేయడానికి ముందు గ్రీన్ టీ సేవిస్తే.మంచిదంటున్నారు నిపుణులు.