సునీల్ కి సూపర్ గిఫ్ట్ ఇవ్వనున్న త్రివిక్రమ్... ఏంటో తెలుసా?

కమెడియన్ సునీల్.హీరో సునీల్.విలన్ సునీల్.ఇలా అన్ని పాత్రల్లోను అద్భుతంగా నటించిన నటుడు.అలాంటి సునీల్ ఇప్పుడు హీరోగా అవకాశాల్లేక మళ్లీ మొదటి దశకు వచ్చేశాడు.కమెడియన్ గా మంచి స్థానంలో ఉన్న సునీల్ రెండు సినిమాల్లో నటించి హీరోగా ఫిక్స్ అయ్యాడు.

 Trivikram To Give Chance For Sunil In Ntr Role, Crucial Role, Comedian Sunil, Co-TeluguStop.com

కానీ హీరోగా ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు.ఆతర్వాత మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించి కొద్దీ కాలం తర్వాత మళ్ళి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు.

కానీ గతంలో వచ్చిన క్రేజ్ ఇప్పుడు రాలేదు.
ఇంకా ఆతర్వాత విలన్ పాత్రల్లో మెప్పించాడు.

ఇటీవల ఓటిటిలో విడుదలైన కలర్ ఫోటోకి యమా క్రేజ్ వచ్చింది.ఆ సినిమాలో విలన్ పాత్రలో నటించిన సునీల్ ని చూసి అందరూ షాక్ కి గురయ్యారు.ఏంటి? సునీల్ ఆ అలా నటించింది అని.ఇంకా ఈ నేపథ్యంలోనే సునీల్ నెక్స్ట్ ఫిలిమ్స్ ఏంటి అని అందరూ ఎదురు చూస్తున్నారు.అయితే సునీల్ కు ఇప్పుడు త్రివిక్రమ్ పెద్ద గిఫ్ట్ ఇవ్వనున్నట్టు సమాచారం.ఆ గిఫ్ట్ చూస్తే ఎవరైనా సరే అవాక్కవుతారు.అంతటి గిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.

Telugu Color, Role, Sunil, Crucial Role, Trivikram, Trivikramgive, Villain-Movie

సునీల్, త్రివిక్రమ్ సినిమాల్లోకి రాకముందు నుంచే ఫ్రెండ్స్.ఇద్దరు ఒకే రూమ్ లో ఉండేవారు.ఆతర్వాత త్రివిక్రమ్ సినిమాల్లో సక్సెస్ అవ్వడం.

ఆ సినిమాల్లో కొన్ని ప్రత్యేకమైన పాత్రలు సునీల్ కి ఇవ్వడం వల్ల మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇక హీరోగా వెళ్లి తిరిగివచ్చిన తర్వాత కూడా అరవింద సమెత, అల వైకుంఠపురములో వంటి చిత్రాల్లో అవకాశం ఇచ్చినప్పటికీ సునీల్ కి సెట్ అవ్వవు అని టాక్ వచ్చింది.

ఇక తదుపరి సినిమాలో సునీల్ పాత్రపై ప్రత్యేక ద్రుష్టి పెట్టినట్టు.మళ్ళీ కమెడియన్ గా ప్రత్యేక స్థానంలో ఉంచేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

మరి ఈ సినిమాతో సునీల్ దశ మారుతుంది ఏమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube