స్టెప్పులతో అదరగొట్టిన తారక్ జపాన్ ఫ్యాన్స్.. వీడియో వైరల్!

స్మార్ట్ ఫోన్ల రాకతో ఇంటర్నెట్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది.ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో ఇతర దేశాల్లోని ప్రజలకు తెలుస్తోంది.

 Japanese Couple Dance For Junior Ntr Love Dabba Song, Nannaku Prematho, Rakul Pr-TeluguStop.com

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ కు ఇతర రాష్ట్రాలతో పాటు జపాన్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.డ్యాన్సుల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ పాటలకు డ్యాన్స్ వీడియోలు చేసి జపాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఒక జంట గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అశోక్, కంత్రి సినిమాల్లోని పాటకు డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.అదే జంట సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమాలోని లవ్ దెబ్బ పాటకు డ్యాన్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఎన్టీఆర్ , రకుల్ ప్రీత్ సింగ్లలా డ్రెస్స్ వేసుకుని, అవే స్టెప్పులు వేస్తూ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు.కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియోను తమ సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేసుకుంటున్నారు.తారక్ జపాన్ ఫ్యాన్స్ కొత్తకొత్త వీడియోలను పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఎన్టీఆర్, రకుల్ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ జపాన్ జంట చేసిన ఈ వీడియోకు వేల సంఖ్యలో లైకులు వస్తున్నాయి.

ప్రస్తుతం తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి ఫిక్షనల్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.వచ్చే ఏడాది సెకండాఫ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube