కరోనా వ్యాక్సిన్: ఫైజర్‌ తీపికబురు.. బ్రిటన్‌కు భారతీయుల పరుగులు

మానవాళిని నాలుగు గోడల మధ్య కట్టిపడేసి.లక్షల మంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనా వైరస్ టీకా కోసం ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది.

 Travel Agents Receive Enquiries From Indians Keen On Going To Uk To Get Covid-19-TeluguStop.com

ఇప్పటికే పలు దేశాల్లో వ్యాక్సిన్ అభివృద్ధి దశలో వుంది.ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ఫైజర్ బయో ఎన్ టెక్ రూపొందించిన టీకాను అత్యవసర వినియోగానికి ఉపయోగించవచ్చని యూకే ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఫైజర్‌ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌కు చెందిన ఔషధ నియంత్రణా సంస్థ ఎంహెచ్‌ఆర్‌ఏ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.టీకా అధ్యయనాల్లో ఇది 95 శాతం ప్రభావవంతంగా పనిచేయడంతో వైద్యులు, వయో వృద్ధులు లాంటి వారికి వచ్చే వారం నుంచి పంపిణీని ప్రారంభించాలని యూకే భావించింది.

అటు ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతి లభించడంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులుగా వున్నవారు.ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనుకుంటున్న వారి చూపు యూకేపై పడింది.టీకా కోసం ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా బ్రిటన్ వెళ్లేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారట.ఈ లిస్ట్‌లో భారతీయులు కూడా వున్నారు.

మనదేశం నుంచి బ్రిటన్ వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో జనం ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించినట్లుగా తెలుస్తోంది.అయితే తొలి ప్రాధాన్యం కింద వృద్ధులు, మెడికల్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు యూకే వెల్లడించింది.

కానీ విదేశీయులకు ఎప్పుడు ఇస్తారన్న దానిపై ఇంకా స్పష్టంగా తెలియలేదు.ఇలాంటి సమయంలో తాము ప్రయాణికులకు ఎలాంటి వివరాలు ఇవ్వలేమని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయట.

Telugu Corona Vaccine, Quarantine, Mhra Approved, Pfizer Bio Tech, Pfizer Vaccin

యూకే ప్రభుత్వం విదేశీయులకు కూడా టీకా ఇచ్చేందుకు అనుమతి ఇస్తే తాము ప్రయాణాలకు ఏర్పాట్లు చేస్తామని ఏజెంట్లు తేల్చి చెబుతున్నారు.కాగా, వ్యాక్సిన్ కోసం ప్రత్యేకంగా యూకేకు వెళ్లాలనుకునేవారి కోసం మూడు రాత్రుల ప్రత్యేక ప్యాకేజీని ప్రారంభించాలని ప్రణాళికలో వున్నట్లు ఓ ట్రావెల్ సంస్థ వెల్లడించింది.

మరోవైపు అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి యూకే ప్రభుత్వం ఇటీవల కఠిన నిబంధనలు విధించింది.విదేశాల నుంచి బ్రిటన్‌ వచ్చిన వారు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలి.

ఆరో రోజు కరోనా పరీక్ష చేసుకున్న తర్వాత అందులో నెగటివ్‌ వస్తే ఐసోలేషన్‌ నుంచి బయటకు రావాలని వెల్లడించింది.ఇలాంటి పరిస్థితుల్లో విదేశీయులకు టీకా ఇస్తారో లేదో చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube