వామ్మో.. బస్సులో మంటలు.. చూస్తుండగానే బూడిదైంది!

సాధారణంగా మనం బస్సు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎన్నో అవాంతరాలు ఏర్పడతాయి.మరి కొన్నిసార్లు బస్సు ప్రమాదాలు జరిగి, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో చూశాం.

 Private Bus ,sion Panwell Highway,mumbai,bus Caught Fire,bus,fire Accident, Mumb-TeluguStop.com

ఇలాంటి తరహాలోనే ముంబై నుంచి సొల్హాపూర్‌ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సులో ఆకస్మాత్తుగా పొగలు అలుముకుని మంటలు చెలరేగిన ఘటన సియాన్_ పాన్వెల్ హైవేపై చోటు చేసుకుంది.అయితే బస్సులో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే…

ముంబై నుంచి సొల్హాపూర్‌ వైపు ప్రయాణికులతో బయలుదేరి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు సియాన్_ పాన్వెల్ హైవేపై దగ్గరకు రాగానే బస్సులో ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి.దీంతో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెంది, భయంతో హుటాహుటిన బస్సు నుంచి బయటకు పరుగులు తీశారు.

అయితే తర్వాత ఒక్కసారిగా పెద్ద ఎత్తున బస్సులో మంటలు వ్యాపించాయి.

Telugu Bus, Mumbai, Private Bus, Panwell Highway-Latest News - Telugu

ప్రయాణికులందరూ సురక్షితంగా బయట పడినప్పటికీ, ఒక ప్రయాణికుడు మాత్రం ఆ మంటల్లో చిక్కుకుపోయాడు.స్థానికుల సహాయంతో అతడిని ఆ మంటల నుంచి సురక్షితంగా కాపాడి చివరకు ప్రాణాలతో బయటకు తీశారు.బస్సు ప్రమాదం జరగడానికి గల కారణాలను ఆరా తీయగా బస్సులో ఉన్న బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడం వల్ల ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకుని మంటలు వ్యాపించాయని తెలిసింది.

బస్సులో మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో, హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.అప్పటికే బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది.

ఈ బస్సు ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో ప్రయాణికులందరూ బతుకు జీవుడా అంటూ సురక్షితంగా బయట పడ్డారు.అయితే ఈ బస్సు ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube