కమెడియన్ గా సక్సెస్ అయ్యి టర్న్ తీసుకొని హీరోగా వరుస సినిమాలు చేసి అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకమరల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యే ప్రయత్నంలో ఉన్న నటుడు సునీల్.ఓ వైపు స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే రీసెంట్ గా కలర్ ఫోటో సినిమాలో విలన్ గా మెప్పించాడు.
ఈ సినిమా ద్వారా తనలోని మరో యాంగిల్ లో సునీల్ దర్శకులకి పరిచయం చేశాడు.ఇదిలా ఉంటే సునీల్ మరల హీరోగా సినిమాలు చేయడానికి కావాల్సిన అవకాశాలు దక్కుతున్నాయి.
కన్నడ సూపర్ హిట్ ఫిలిం బెల్ బాటమ్ సినిమాని తెలుగులో సునీల్ హీరోగా తెరకెక్కించాలని అనుకుంటున్నారు.దీంతో పాట హరీష్ శంకర్ సమర్పణలో 14 రీల్స్ బ్యానర్ లో వేదాంతం రాఘవయ్య సినిమాని ఎప్పుడో ఎనౌన్స్ చేశారు.
ఇదిలా ఉంటే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర సునీల్, అజయ్ కాంబినేషన్ లో ఒక వెబ్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.
వి.ఎన్ ఆదిత్యా ఈ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత దర్శకుడుగా రీఎంట్రీ ఇస్తున్నాడు.
అయితే ఈ సినిమా గురించి ఎలాంటి ఎనౌన్సమెంట్ లేకుండా డైరెక్ట్ గా షూట్ స్టార్ట్ చేసి సగం పూర్తి చేసినట్లు తెలుస్తుంది.ఇకపై ఇదే తరహాలో ఓటీటీ కోసం వెబ్ ఫిల్మ్ లని కూడా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించాలని నిర్మాత అనిల్ సుంకర ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
మొత్తానికి సునీల్ హీరోగా చాలా గ్యాప్ తర్వాత మరల మూడు సినిమాలు రెడీ అవుతున్నాయని తెలుస్తుంది.వీటిలో ఒక్కటి సక్సెస్ అయినా మరల సునీల్ తన హీరో ఇమేజ్ ని కొనసాగిస్తూ మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంటుంది.