ఒకప్పటి ఈ హీరోయిన్ చెల్లెలు కూడా ఓ హీరోయిన్ అని మీకు తెలుసా...?

తెలుగు వెటరన్ సీనియర్ హీరోయిన్ జీవిత మరియు ఆమె భర్త టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్ గురించి చిత్ర పరిశ్రమలో తెలియని వారుండరు.అయితే ఇప్పటి వరకు నటి జీవితగురించి తెలియని విషయం ఒకటి ఉంది.

 Telugu Actress Jeevitha Rajasekhar Sister Uma News, Jeevitha Rajasekhar, Telugu-TeluguStop.com

 ఇంతకీ ఆ విషయం ఏంటంటే నటి జీవిత చెల్లెలు ఉమ కూడా తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపుగా నాలుగు చిత్రాలలో నటించిందని.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే జీవిత తెలుగులో “తలంబ్రాలు” అనే చిత్రంలో నటి జీవిత హీరోయిన్ గా నటించిన సంగతి అందరికి తెలిసిందే.

 అయితే ఈ చిత్ర షూటింగ్ పనులు జరుగుతున్న సమయంలో జీవిత చెల్లెలు ఉమ కూడా సినిమా షూటింగ్ లొకేషన్ కి రావడంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత ఆమెకు నటిగా అవకాశం ఇచ్చాడట. దీంతో ఈ చిత్రం అప్పట్లో మంచి హిట్ అయ్యింది.

 

అంతేగాక ఉమ కి పలు చిత్రాల్లో నటించే అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది.కానీ ఉమ హీరోయిన్ గా నటించిన రెండు చిత్రాలు ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.

దీంతో ఉమ సినిమా పరిశ్రమను వదిలి పెట్టి వ్యాపారాల్లో బాగా రాణిస్తున్నటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని ఒక పక్క తన కుటుంభం బాధ్యతలను చక్కబెడుతూనే మరో పక్క తన భర్తకి వ్యాపార పనుల్లో చేదోడుగా నిలుస్తోంది.

Telugu Rajasekhar, Talambralu, Telugu Actress, Teluguactress, Telugu Vetrean, Um

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటి జీవిత భర్త  రాజ శేఖర్ కరోనా వైరస్ బారిన పడి విజయవంతంగా  కోలుకున్నాడు. అంతేగాక ఈ విషయంపై నటి జీవిత స్పందిస్తూ తన భర్త రాజశేఖర్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు  అలాగే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్న సమయంలో తీసుకున్నటువంటి ఫోటో ని కూడా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేస్తూ అభిమానులు ఆందోళన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube