జనవరి నెల నుండి కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచం నలుమూలల థియేటర్స్ మూతపడడంతో ప్రజలందరూ వినోదం కోసం ఓటీటీ ల వైపు నడిచారు.ఇందుకు తగ్గట్టుగానే ఎంతోమంది హీరో హీరోయిన్లు నటించేందుకు, అలాగే దర్శకనిర్మాతలు కూడా వారి కంటెంటును ఓటిటి లో విడుదల చేసేందుకు ఉత్సాహం చూపించారు.
అయితే ఈ మధ్య కాలంలో సినిమా థియేటర్స్ ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కానీ థియేటర్స్ ఓనర్స్ అలాగే ఎగ్జిబిటర్స్ సినిమాను ఆడించేందుకు ముందుకు రావట్లేదు.అయితే దీనికి కారణం లేకపోలేదు కేవలం సగం ఆక్యుపెన్సీ తోనే మాత్రమే సినిమాలను ఆడించాలని దాంతోపాటు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి కొందరు సినిమా హాల్స్ కు పర్మిషన్ ఇచ్చినా సరే అందులో సినిమాలను ప్రదర్శించలేదు.
ఇక ప్రస్తుతం ఓటిటి ఫ్లాట్ ఫామ్ కు ఉన్న డిమాండ్ కారణంగా సరికొత్త ఓటిటి ఫ్లాట్ ఫామ్ మొదలైంది.ప్రస్తుతం మనకు అందుబాటులో జి౫, ఆహా, అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, శ్రేయస్ ఈటి లతో పాటు చిన్న చిన్న ఓటిటి ఫ్లాట్ ఫామ్ లు కూడా తెలుగులో అందుబాటులో ఉన్నాయి.
వీటితో పాటు తాజాగా వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ” ఫిలిం ” ఓటిటి అనే ఫ్లాట్ ఫామ్ రెడీ అయిపోయింది.ఈ ప్లాట్ ఫామ్ అందుబాటులోకి రావడం రావడమే మంచి క్రేజీ సినిమాలతో తన జర్నీ మొదలుపెట్టబోతుంది.
కేవలం సినిమాలు మాత్రమే కాకుండా బలమైన కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లను అలాగే ఇండిపెండెంట్ సినిమాలను కూడా ఈ ఫ్లాట్ ఫామ్ తో ముందుకు తీసుకురాబోతున్నారు.థ్రిల్లర్స్, డ్రామా, కామెడీ, యాక్షన్ లాంటి డిఫరెంట్ జోనర్ ఉన్న సినిమాలను ఆడియన్స్ దగ్గరికి చేర్చేందుకు ఫిలిం అనే ఫ్లాట్ ఫామ్ రెడీ అయ్యింది.
ఇకపోతే ఈ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో విజయ్ సేతుపతి నటించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా పిజ్జా – 2 , అలాగే మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన రంగూన్ రౌడీ, అలాగే నివిన్ పౌలీ – త్రిష కాంబినేషన్ లో వచ్చిన హే జూడ్, జె.డి.చక్రవర్తి నటించిన మాస్క్ సినిమాలు ఫ్లాట్ ఫామ్ లో దర్శనం ఇవ్వబోతున్నాయి.