వెబ్ సిరీస్ లు నిర్మించనున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

రౌడీ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ.అరడజను సినిమాలకి యూత్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ క్రేజీ హీరోగా ప్రస్తుతం తెలుగులో మంచి గిరాకీ ఉంది.

 Vijay Devarakonda To Produce Web Series, Tollywood, Telugu Cinema, Digital Enter-TeluguStop.com

ఇతనితో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు.అయితే గత ఏడాది విజయ్ దేవరకొండ నుంచి వచ్చిన మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

అయితే ఏ మాత్రం అతని క్రేజ్ అయితే తగ్గలేదు.ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఫైటర్ చేస్తున్నారు.

దీని తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్ లో ఇంద్రగంటితో ఒక పాన్ ఇండియా సినిమా ఉంది.దాంతో పాటు రీసెంట్ గా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేశాడు.

ఇలా అందరూ పెద్ద పెద్ద దర్శకులతో విజయ్ దేవరకొండ కమిట్మెంట్ లు ప్రస్తుతం ఉన్నాయి.

ఇదిలా ఉంటే హీరోగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్న విజయ్ దేవరకొండ మరో వైపు నిర్మాతగా మారి లోబడ్జెట్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు.

ఇప్పటికే తరుణ్ భాస్కర్ ని హీరోగా పరిచయం చేస్తూ మీకు మాత్రమే చెప్తా అనే సినిమా తెరకెక్కించాడు.అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు.

అయితే ఇప్పుడు సినిమాలు పక్కన పెట్టి వెబ్ సిరీస్ ల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో రెండు వెబ్ సిరీస్ లని విజయ్ ప్లాన్ చేశాడు.

అందులో దొరసాని ఫేమ్ కేవీ మహేంద్ర దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ ని పట్టాలు లెక్కిస్తున్నాడు.మరో వైపు సందీప్ రెడ్డి వంగా కథతో ఒక వెబ్ సిరీస్ ని నిర్మించడానికి రెడీ అయ్యాడు.

ఈ రెండు సక్సెస్ లు బట్టి ఫ్యూచర్ లో మరిన్ని ప్రాజెక్ట్ లు సెట్స్ పైకి తీసుకెళ్లి కొత్తవాళ్లని పరిచయం చేయాలని అనుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube