సౌత్ ఇండియాలో ఆ విషయంలో విజయ్ దేవరకొండనే నెంబర్ 1

విజయ్ దేవరకొండ.ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 9million Follwers For Vijay Devarakonda In Instagram, Social Media, Pelli Chupul-TeluguStop.com

ఎన్నో ఏళ్లు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగి సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అయినా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.తన పాత్రకు ప్రత్యేకత ఉందా లేదా అనేది పక్కన పెట్టి ఆ సినిమాల్లో నటించాడు విజయ్.
ఇండస్ట్రీకి వచ్చిన 7 ఏళ్లకు విజయ్ కు ఒక సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది.అదే పెళ్లి చూపులు.ఈ సినిమాలో తనకు పెద్దగా మార్కులు పడకపోయినప్పటికీ మంచి హిట్ కొట్టాడు.ఆ సినిమా రిలీజ్ అయిన సంవత్సరానికి అర్జున్ రెడ్డి సినిమాతో తన నటన ఏంటో.

తన స్టైల్ ఏంటో ప్రేక్షకులకు చూపించాడు.

ఆ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ పేరు మారుమోగిపోయింది.

అందరి నోటా వావ్ అనే మాటే.ఇక ఆతర్వాత వరుసగా అవకాశాలు రావడం.

సినిమాలు ఒకటి హిట్.ఒకటి ప్లాప్ అవ్వడం వరుసగా జరిగిపోయాయి.

ఇప్పుడు విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.
అయితే ఈ హీరో సౌత్ ఇండియాలోనే ఓ విషయంలో నెంబర్ 1 అయ్యాడు.

అది ఏంటి అనుకుంటున్నారా? ఇంస్టాగ్రామ్ లో ఈ సెన్సేషనల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ సౌత్ ఇండియాలోనే 9 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరోగా రికార్డు సృష్టించాడు.సొంతంగా సినిమాల్లోకి అడుగుపెట్టి రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటూ అభిమానుల ప్రేమను ఓ రేంజ్ లో సొంతం చేసుకున్నాడు ఈ రౌడీ హీరో.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.కేవలం పూరి జగన్నాథ్ ఏ కాదు త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో కూడా ఈ సెన్సేషనల్ హీరో నటించనున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube