మహేష్ ఇస్తోన్న డబుల్ ట్విస్టుతో అవాక్కవ్వనున్న ఫ్యాన్స్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సంక్రాంతి బరిలో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అదిరిపోయే సక్సెస్‌ను తనపేరిట వేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ కూడా చేశాడు.

 Mahesh Babu Twist In Sarkaru Vaari Paata, Mahesh Babu, Sarkaru Vaari Paata, Para-TeluguStop.com

దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను కూడా పెట్టారు.కాగా ఈ సినిమా ఆర్థిక నేరాల చుట్టూ తిరుగుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమాలో మహేష బాబు చాలా అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు కనిపిస్తాడని, అందుకోసమే తాను మేకోవర్ చేస్తున్నాడని చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.కాగా అందరికీ షాకిస్తూ ఈ సినిమాలో మహేష్ పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో మహేష్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మనకు కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.అందుకోసమే ఆయన సరికొత్త లుక్‌లో మనకు కనిపించనున్నాడు.ఇప్పటికే ప్రీలుక్‌లో ఉన్న విధంగా కర్లీ హెయిర్‌తో పాటు మరో లుక్‌లో మహేష్ కనిపిస్తాడని తెలుస్తోంది.

ఈ రెండు షేడ్స్‌తో మహేష్ పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించి వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఈ సినిమా షూటింగ్‌ను తొలుత ఫారిన్ లొకేషన్స్‌లో జరపాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది.

అందులో భాగంగా త్వరలో ‘సర్కారు వారి పాట’ టీమ్ ఫారిన్ వెళ్లేందుకు రెడీ అవుతోంది.ఇక ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube