ఆ రికార్డు గురించి ఆలోచన లేదన్న పవన్‌ ఫ్యాన్స్‌

పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌ డే కోసం ఇండస్ట్రీ వారు మరియు ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పవన్‌ బర్త్‌ డే సందర్బంగా సోషల్‌ మీడియాలో మరోసారి సెన్షేషన్‌ క్రియేట్‌ చేయాలనే పట్టుదలతో ఫ్యాన్స్‌ ఉన్నారని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది.

 Pawan Kalyan Fans Not Show The Intrested In Twitter Records, Pawan Kalyan, Birth-TeluguStop.com

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ట్విట్టర్‌ లో రికార్డు గురించి పెద్దగా పట్టించుకోకుండా ఈసారి పవన్‌ బర్త్‌ డేకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.

ప్రస్తుతం కరోనా కారణంగా ఆసుప్రతుల్లో ఆక్సీజన్‌ లేక జనాలు చనిపోతున్నారు.

అందుకే వందలాది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సీజన్‌ కిట్‌ లను ఇవ్వాలనే నిర్ణయానికి ఫ్యాన్స్‌ వచ్చారు.సొంతంగా కాని కొంత మొత్తం కాని ఇవ్వడం వల్ల వారి పేరు మీద పవన్‌ బర్త్‌ డే సందర్బంగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సీజన్‌ కిట్‌ లను ఇస్తామంటూ ప్రకటించారు.

అయితే ఇప్పటి వరకు పవన్‌ ఫ్యాన్స్‌ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు.ఈసారి ఈ ఆక్సీజన్‌ కిట్స్‌ తో కూడా రికార్డు సృష్టించారు.

సోషల్‌ మీడియాలో కోట్ల ట్వీట్స్‌ కు బదులుగా కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి వందలాది ఆక్సీజన్‌ కిట్స్‌ ను ప్రభుత్వ ఆసుప్రతులకు అందిస్తున్నారు.అన్ని కూడా పవన్‌ బర్త్‌ డే సందర్బంగా రేపు అంటే సెప్టెంబర్‌ 2 ను ఇవ్వబోతున్నారు.

అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇక ట్విట్టర్‌ రికార్డు గురించి ఆలోచన అయితే లేదు.

కాని ఫ్యాన్స్‌ భారీగానే ట్వీట్స్‌ చేసే అవకావం ఉందంటున్నారు.పవన్‌ బర్త్‌ డే కామన్‌ డీపీకి 6.5 కోట్ల ట్వీట్స్‌ నమోదు అయ్యాయి.మరి బర్త్‌ డేకు ఎన్ని ట్వీట్స్‌ నమోదు అవుతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube