చిరంజీవి వాయిస్‌ మెసేజ్‌ అందుకున్న క్యూట్‌ కపుల్‌

లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ చిత్రంలో ఒక హీరోగా కనిపించిన సుధాకర్‌ కోమాకుల ఇటీవల చిరంజీవి బర్త్‌ డే సందర్బంగా తన భార్య హారికతో కలిసి ఇందువదన.పాటకు కవర్‌ వీడియో షూట్‌ చేశాడు.

 Sudhakar Komakulu Couple Received The Message From Chiranjeevi,sudhakar Komakulu-TeluguStop.com

చిరంజీవి బర్త్‌ డే సందర్బంగా ఆ వీడియోను విడుదల చేశారు.సుధాకర్‌ మరియు హారికలు చిరంజీవి విజయశాంతిలను మరపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.

వారు చేసిన ప్రయత్నం నిజంగా అభినందనీయం.చిరంజీవి స్టెప్పులను మ్యాచ్‌ చేసేందుకు సుధాకర్‌ కష్టపడ్డాడు.

ఇక సినిమా బ్యాక్‌ డ్రాప్‌ కాకున్నా కూడా అతడి భార్య హారిక కూడా మంచి డాన్సర్‌ గా మెప్పించింది.

ఈ కపుల్‌ డాన్స్‌ కు మెగాస్టార్‌ ఫిదా అయ్యాడు.

మీరు ఇండియాలో ఉండి ఉంటే ఖచ్చితంగా ఇంటికి పిలిపించి మీతో లంచ్‌ చేసేవాడిని కాని మీరు అమెరికాలో ఉండటం వల్ల మీకు ఈ వాయిస్‌ మెసెజ్‌ చేస్తున్నాను అంటూ ఒక సుదీర్ఘ వాయిస్‌ మెసేజ్‌ ను చిరంజీవి సుధాకర్‌ దంపతులకు పంపించారు.అందులో మీరు నా బర్త్‌ డే సందర్బంగా చేసిన పాట నా మనసుకు హత్తుకుంది.

మీరు పడ్డ కష్టంకు కృతజ్ఞతలు.ఆ పాటలో మీరు డాన్స్‌ లను మ్యాచ్‌ చేసేందుకు ప్రయత్నించిన తీరు నన్ను ఆకట్టుకుంది అన్నారు.

నువ్వు అంటే సినిమా వాడివి కనుక డాన్స్‌ వచ్చి ఉంటుంది.కాని సాఫ్ట్‌ వేర్‌ ఎంప్లాయి అయిన హారిక అంతలా డాన్స్‌ చేయడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది.ఇక్కడ నీ కంటే నీ భార్యకు ఎక్కువ మార్కులు పడుతాయంటూ ఫన్నీగా కామెంట్‌ చేశాడు.పాటలో ఎలా అయితే సమన్వయంతో స్టెప్పులు వేసి చక్కని పాటను చేశారో అలాగే జీవితంలో కూడా మీరు చక్కని సమన్వయంతో సంసార జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి జంటకు శుభాకాంక్షలు తెలియజేశాడు.

Happy Days Fame Sudhakar & Wife Harika Awesome Performance for Chiranjeevi Blockbuster Induvadhana song

MEGASTAR's response to Sudhakar & Harika Couple Performance

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube