రియా నెంబర్‌ బ్లాక్‌ చేయడం వల్లే సుశాంత్‌ చనిపోయాడా?

సుశాంత్‌ మృతి చెంది రెండున్నర నెలలు గడుస్తున్నా కూడా సోషల్‌ మీడియాలో ఆ విషయమై ప్రధానంగా చర్చ జరుగుతూనే ఉంది.ఇక ఈ కేసును సీబీఐ వారికి అప్పగించిన నేపథ్యంలో మరింతగా జనాల్లో ఆసక్తి వ్యక్తం అవుతోంది.

 Rhea Chakraborty Had Blocked Sushant Singh Rajput's Phone Number, Sushant Singh-TeluguStop.com

సుశాంత్‌ అభిమానులు మొదటి నుండి కూడా అతడి మృతికి రియా కారణం అంటున్నారు.ఆమె వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కొందరు లేదంటే ఆమె స్లో పాయిజన్‌ ఇచ్చి చంపిందని కొందరు మరికొందరు ఆమె మనుషులతో చంపించి ఆత్మహత్యగా చిత్రీకరించింది అంటూ ఆరోపిస్తున్నారు.

ఇలాంటి సమయంలో రియా నుండి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

ఇటీవల రియా ఒక జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో జూన్‌ 8వ తారీకున సుశాంత్‌ ఇంటి నుండి వెళ్లి పోయిన పరిస్థితుల గురించి చెప్పింది.సుశాంత్‌ తన సోదరి మరియు తండ్రి వస్తున్నారు.నువ్వు వెళ్లు అంటూ ఒత్తిడి చేశాడు.అయితే నేను ఒప్పుకోలేదు.

వారు వచ్చిన తర్వాత వెళ్తే బాగుంటుంది.వారు వస్తున్నారని వెళ్తే ఏం బాగుంటుందని అన్నాను.

కాని సుశాంత్‌ మాత్రం మరో రెండు గంటల్లో సోదరి వస్తుందని నన్ను బలవంతంగా అక్కడ నుండి పంపించాడు.ఆ సమయంలో నా ఆరోగ్యం బాగాలేదని ఆయనకు కూడా తెలుసు.

Telugu Interview, Rheachakraborty, Sushantsingh-

నేను ఇంటికి వచ్చిన తర్వాత కాల్‌ చేస్తాడేమో అనుకున్నాను.నా ఆరోగ్యం బాగా లేదని తెలిసి కూడా 8వ తారీకు మొత్తం నాకు కాల్‌ చేయలేదు.9వ తారీకున మెసేజ్‌ చేశాడు.అది కూడా పొడి పొడిగానే చేసినట్లుగా అనిపించింది.

అందుకే అతడికి ఇప్పుడు నేను వద్దేమో అని అతడి నెంబర్‌ ను బ్లాక్‌ చేశాను అంది. రియా నెంబర్‌ బ్లాక్‌ చేయడం వల్లే సుశాంత్‌ మరింత డిప్రెషన్‌ కు గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube