వి స్టోరీ లీక్.. ట్విస్టులే ట్విస్టులు!

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘వి’ వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.

 Nani V Story Leaked, Nani, V Movie, Sudheer Babu, Niveda Thomas, Aditi Rao Hydar-TeluguStop.com

దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మరో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

కాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమా కథ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో నాని భార్య అదితిరావు హైదరిని అత్యంత దారుణంగా మర్డర్ చేస్తారు.దీంతో ఆమెను చంపిన వారిని నాని ఏ విధంగా చంపుతూ వెళ్తాడు, నానిని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ అయిన సుధీర్ బాబు ఏం చేస్తాడు? అనేది సినిమా కథట.

మొత్తానికి నాని ఈసారి పూర్తి రివెంజ్ డ్రామాతో మనముందుకు వస్తున్నట్లు ఈ లీకైన కథను చూస్తే తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో మరో బ్యూటీ నివేదా థామస్ కూడా నటిస్తోంది.

ఈ సినిమాలో నానిని పట్టుకునేందుకు సుధీర్ బాబు చేసే ప్రయత్నాలు, వాటిని నాని ఎలా తిప్పికొట్టాడనేది సినిమా కథగా ఉంటుందట.ఇక ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube