కాలినడకన కెనడా నుంచి అమెరికాకు: సరిహద్దుల్లో భారతీయుడి అరెస్ట్

అమెరికాలో ఉన్నత విద్య చదివి తర్వాత మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడాలని లక్షలాది మంది భారతీయ యువత కల.అయితే వీసా నిబంధనలు కఠినతరమవుతూ ఉండటంతో పాటు అనేక వ్యయప్రయాసల కారణంగా పలువురు దొడ్డిదారిన అగ్రరాజ్యంలో అడుగుపెడుతున్నారు.

 Indian National Held For Crossing Illegally Into America From Canada, America, C-TeluguStop.com

ఈ ప్రయత్నంలో అక్కడి అధికారుల చేతికి చిక్కి జైళ్లలో మగ్గుతున్న వారు ఎందరో వున్నారు.తాజాగా కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఓ భారతీయుడిని యూఎస్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెంట్లు అరెస్ట్ చేశారు.

అతని పేరు వివరాలను వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు.ఇతను కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్‌లోని కౌట్స్ నుంచి నుంచి కాలినడకన అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నించాడు.ఈ క్రమంలో అతనిని స్వీట్‌గ్రాస్ స్టేషన్‌ వద్ద శనివారం బోర్డర్ ఏజెంట్లు పట్టుకున్నారు.తాను భారతీయ పౌరుడినని, అమెరికాలో అడుగుపెట్టేందుకు కెనడా నుంచి కాలినడకన బయల్దేరినట్లు అతను విచారణ సందర్భంగా తెలియజేశాడు.

పోలీసుల కంట పడకుండా ఉండేందుకు గాను స్వీట్‌గ్రాస్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ చుట్టూ తిరుగుతున్నానని తెలిపాడు.

Telugu America, American, Canada, Indian National, Indiannational-

ఆ వ్యక్తి వద్ద కొన్ని బ్యాగులను పోలీసులు గుర్తించారు.అయితే అవి ప్రమాదకరమైనవి కావని వెల్లడించారు.యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉన్నారనడానికి ఇదో ఉదాహరణ అని హవ్రే సెక్టార్ డిప్యూటీ చీఫ్ పెట్రోల్ ఏజెంట్ స్కాట్ గుడ్ అన్నారు.

అమెరికా ప్రజలను రక్షించడానికి ఏజెంట్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube