రెండేళ్లు కేటాయించిన తారక్.. ఎవరి కోసమో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కాగా కొంతమేర షూటింగ్ మిగిలి ఉండగా, ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

 Ntr Allotted Two Years For Kgf Director, Ntr, Prashanth Neel, Kgf, Ntr31, Tollyw-TeluguStop.com

తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు.

కాగా ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు తారక్-త్రివిక్రమ్ కాంబో చూస్తోంది.

అయితే ఈ సినిమా తరువాత కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ తన నెక్ట్స్ మూవీని చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమాను పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడప్రశాంత్ నీల్ట.కాగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనుండటంతో ఈ సినిమా కోసం ఎక్కువ డేట్లు కావాలని దర్శకుడు తారక్‌ను కోరాడట.

దీంతో తారక్ ఈ సినిమా కోసం ఏకంగా రెండేళ్ల డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ లెక్కన త్రివిక్రమ్ సినిమా తరువాత తారక్ మరో రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించే పనిలో ఉంటాడని, అంటే ఈ సినిమాను ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా మొదలయ్యే వరకు ఆగాల్సిందే.కాగా తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీం పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube