ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తుంది.ఈ వైరస్ బారినపడి చాల మంది ప్రాణాలను కోల్పోయారు.
ఈ మహమ్మారికి చెక్ పెట్టడానికి ప్రపంచ దేశాలు చాల ప్రయోగాలు చేస్తున్నారు.అయితే ఈ వైరస్ రోజురోజుకు కొత్త కొత్త లక్షణాలతో విజృంభిస్తుంది.
అయితే ఈ వ్యాధికి మొదటగా దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు తడారిపోవడం, తలనొప్పి, కండరాల నొప్పి వాటిని కరోనా లక్షణాలుగా గుర్తించారు.
కొన్ని రోజులు గడిచాక కరోనా వైరస్ లో మళ్ళి కొత్త లక్షణాలను గుర్తించారు.
ఈ లక్షణాల్లో కళ్లు ఎర్రబడి, కొన్ని రోజులకు రుచి, వాసన శక్తిని కోల్పోవడం వంటివి కొవిడ్ లక్షణాలుగా నిపుణులు వెల్లడించారు.అంతేకాదు ఈ జాబితాలో మరో లక్షణం కూడా చేర్చారు.
అది ఏంటంటే ఆపకుండా ఎక్కిళ్లు రావడం కరోనా లక్షణం అని పరిశోధకులు తెలియజేశారు.దీనికి సంబంధించిన విషయంపై అమెరికా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
అయితే వారి ప్రయోగంలో వరుసగా 4 రోజుల పాటు ఎక్కిళ్లు ఆగిపోకపోతే కరోనా వచ్చినట్లు అనుమానించాలన్నారు.వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని అమెరికన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
అంతేకాదు ఈ అంశంపై ఇంకా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.అంతేకాదు ఎక్కీలను ఆపడానికి వారి సొంత ప్రయోగాలు చేయరాదని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.