ప్రేమకు ఎవరో ఒకరు అడ్డు ఉంటారు.అని కొందరు చెప్తుంటారు.
ఈ ఘటన చూస్తే అదే అనిపిస్తుంది.ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.వారిది విశాఖ జిల్లా సింహాచలం కొండపైన ఉన్న గిరిజన గ్రామం.ఆ గ్రామానికి చెందిన జలుమూరి శ్రావణ్‌కుమార్, పొరిగింట్లో ఉండే అంబికను ప్రేమించి అందరిని ఒప్పించి సంవత్సరం కిందట పెళ్లి చేసుకున్నారు.
అయితే అంబిక గర్భం దాల్చింది.నెలలు నిండడంతో డెలివరీ కోసం ఈ నెల 6వ తేదీన విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు.
అయితే అంబికకు డెలివరీ సమయంలో ఫిట్స్ రావడంతో సిజేరియన్ చేసి మగబిడ్డకు జన్మనిచ్చింది.అయితే బిడ్డకు జన్మనివ్వగానే అనారోగ్యానికి గురై మరణించింది.
అయితే ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన భార్య చనిపోవడంతో శ్రావణ్ తీవ్రంగా కుంగిపోయాడు.భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు.దీంతో ఆదివారం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో వారికీ పుట్టిన 6 రోజుల పసికందు అనాథగా మిగిలిపోయాడు.
ఇంకా ఈ విషాద ఘటన అందరిని కన్నీరు పెట్టిస్తుంది.