యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.వరుసగా సెలెక్టివ్ సినిమాలు చేస్తూ, తాను ఎంచుకున్న కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతున్న నిఖిల్, తాజాగా పెళ్లి పీటలెక్కాడు.
గతకొంత కాలంగా తాను ప్రేమిస్తున్న డా.పల్లవి వర్మను తాజాగా గురువారం నాడు ఉదయం 6 గంటల 31 నిమిషాలకు కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నాడు.
భీమవరంకు చెందిన డా.పల్లవి వర్మను నిఖిల్ ఫిబ్రవరి మొదటి వారంలో గోవాలో నిశ్చితార్థం చేసుకున్నాడు.కాగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏప్రిల్ 16న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని చూసిన నిఖిల్‌కు కరోనా అడ్డుపడింది.దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.
కాగా తమ పెళ్లిని లాక్‌డౌన్‌లోనే జరుపుకోవాలని నిఖిల్ కోరడంతో కుటుంబ సభ్యులు మే 14న ముహూర్తం కుదిర్చారు.దీంతో శామిర్‌పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్‌లో డాక్టర్ పల్లవి వర్మను కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో నిఖిల్ మూడు ముళ్లు వేసి వివాహమాడాడు.
ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఎట్టకేలకు నిఖిల్ పెళ్లి చేసుకున్నాడనే విషయం తెలుసుకున్న పలువురు సెలబ్రిటీలు అతడికి తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కొత్త జంటకు సినీ ప్రముఖుల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.పెళ్లిలో సామాజిక దూరాన్ని పాటించి ఇతరులకు ఆదర్శంగా నిలిచాడంటూ నిఖిల్‌ను అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.