కరోనా అమెరికాలో విలయం సృష్టిస్తోంది.ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా సుమారు 23 వేల మంది మృతి చెందగా దాదాపు 6 లక్షలకి చేరువలో బాధితుల సంఖ్య పెరుగుతోంది.
అమెరికా ఆర్ధిక నగరంపైనే ఈ వైరస్ తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది.ముఖ్యంగా అత్యధిక మరణాలు అన్నీ న్యూయార్క్ నుంచి నమోదు కావడం గమనార్హం.
ఇదిలాఉంటే అమెరికాలో భారతీయ విద్యార్ధుల పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది.
కరోనా కారణంగా అమెరికాలో విద్యా సంస్థలు, యూనివర్సిటీలు హాస్టల్స్ అన్నీ మూత పడ్డాయి.
దాంతో విద్యార్ధులు ఈ క్రమంలో ఎంతో మంది విద్యార్ధులు నానా అవస్థలు పడుతున్నారు.అమెరికా వ్యాప్తంగా సుమారు 2.5 లక్షల మంది భారతీయ విద్యార్ధులు ఉంటారు.వీరిలో కొందరు తమకి తాముగా షెల్టర్ వెతుక్కుని హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నారు.
కొందరికి భారతీయ సంస్థలు సాయం చేస్తున్నాయి.ఈ పరిస్థితుల నుంచీ ఎప్పుడు బయటపడుతామో ఇళ్ళకి ఎప్పుడు వెళ్తామోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.దాంతో
విద్యార్ధుల్లో ధైర్యం నింపడానికి అమెరికాలోని భారత రాయబారి తరుణ్ జిత్ సింగ్ ఇన్స్టా గ్రామ్ లైవ్ ద్వారా సుమారు 500 మంది భారతీయ విధ్యార్ధులతో మాట్లాడారు.వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నాలు చేశారు.
పరిస్థితులు చక్కబడే వరకూ విద్యార్ధులు ఎవరూ కంగారు పడవద్దని అన్నీ అనుకూలంగా ఉన్న తరువాత ఎవరి ప్రాంతాలకి వారు వెళ్ళవచ్చని తెలిపారు.అంతవరకూ హోమ్ క్వారంటైన్ లోనే ఉంటే అమెరికా ప్రభుత్వం సూచించే సూచనలు పాటించమని తెలిపారు.
అమెరికాలో మరి కొంత కాలం ఉండేలా వీసాలు పొడిగించేందుకు భారత రాయబార కార్యాలయం సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.