అమెరికాలో ఒక పక్క కరోనా విలయం సృష్టిస్తోంది.ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా వేలాది మంది మృతి చెందటంతో ట్రంప్ తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది.
ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కరోనా ఎంట్రీ ఇచ్చి ట్రంప్ ని తెగ కలవరపెట్టేస్తోంది.నవంబర్ నాటికి ఎన్నికలు ఎట్టిపరిస్థితుల్లో జరగాలని ట్రంప్ పట్టుబడుతున్నారు.
అందుకు అనుగుణంగా కరోనా పై పోరు తీవ్ర తరం చేశారు.ఇదిలాఉంటే
అమెరికా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష బరికి దాదాపు ఖరారైన అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్ ప్రస్తుతం దూసుకెళ్తున్నారు.
డెమోక్రటి పార్టీ అభ్యర్ధిత్వం కోసం అలాస్కాలో జరిగిన ప్రైమరీలో జో బిడెన్ తన హవా కొనసాగించారు.నిన్నటి వరకూ బిడెన్, సాండర్స్ ఇద్దరూ డెమోక్రటిక్ పార్టీ నుంచీ పోటీలో నిలిచినా సాండర్స్ తప్పుకోడంతో ఇక బిడెన్ కి లైన్ క్లియర్ అయ్యిందనే చెప్పాలి.
కరోనా వైరస్ ప్రభావంతో ఈ ప్రైమరీ ఓటింగ్ ను పోస్టల్ ఓటింగ్ విధానానికి మార్చారు.అయితే

బెర్నీ సాండర్స్ తప్పుకోవడానికి ముందే పోస్టల్ బ్యాలెట్లు చేరుకోవడంతో ఆయనకి కూడా ఈ ఓటింగ్ లో కొంత భాగం ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తోంది.ఇదిలాఉంటే మొత్తం ఓట్లలో సుమారు 55.3 శాతం ఓట్లు సాధించిన బిడెన్ విజేతగా నిలిచారు.సాండర్స్ కి 44.7 శాతం ఓట్లు లభించాయి.వరుస విజయాలతో బిడెన్ డెమోక్రటిక్ పార్టీ నుంచీ అధ్యక్ష అభ్యర్ధిత్వం దాదాపు ఖరారైందని అంటున్నారు నిపుణులు.అయితే ఈ దూకుడు ట్రంప్ పై కూడా ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదని.
ఇప్పటికే బిడెన్ కి వస్తున్న ప్రజా మద్దతు చూస్తుంటే ట్రంప్ కి చెమటలు పడుతున్నాయని ఇదే ఊపు ఎన్నికలవరకూ బిడెన్ కొనసాగిస్తే ట్రంప్ పరిస్థితి గందరగోళంగా మారక తప్పదనేది పరిశీలకు అంచనా.