పుష్పలో ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ

సుకుమార్, బన్నీ కాంబినేషన్ లో మూడో సినిమాకి రంగం సిద్ధమైంది.సుకుమార్ గత సినిమాల తరహాలో స్టైలిష్ గా కాకుండా రంగస్థలం తరహాలో పక్కా మాస్ యాంగిల్ లో ఈ సారి బన్నీని చూపించబోతున్నాడు.

 Sukumar Try To Bollywood Beauty For Puspa Item Song, Tollywood, Telugu Cinema, B-TeluguStop.com

ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేసి సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయంపై సుకుమార్ క్లారిటీ ఇచ్చేశాడు.చిత్తూరు నేపధ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలిమెంట్ తో ఈ కథ ఉండబోతుంది అని తెలుస్తుంది.

పుష్ప టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర పేరు పుష్పరాజ్ అని సుకుమార్ డిసైడ్ చేశాడు.

రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ కి సాలిడ్ హిట్ ఇచ్చిన సుకుమార్ అంతకు ముందు క్లాస్ యాంగిల్ చూపించి ఒక్కసారిగా తనలోనే మాస్ మసాలా దర్శకుడుని పరిచయం చేసాడు.

ఈ సారి కూడా పుష్పరాజ్ తో మరో మాస్ ఎంటర్టైన్మెంట్ తో ఆవిష్కరించబోతున్నాడు.ఇదిలా ఉంటే రంగస్థలంలో జిగేలు రాణి తరహాలోనే ఇందులో చిత్తూరు యాసలో సాగే ఒక మాస్ బీట్ ని సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక ఈ సాంగ్ ని ఫోక్ గాయకుడు పెంచల్ దాస్ తో రాయించబోతున్నారని సమాచారం.అలాగే ఈ సాంగ్ కోసం పూజా హెగ్డే తరహాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించబోతున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే ఒక ఇద్దరు పేర్లు పరిశీలించినట్లు టాక్ నడుస్తుంది.మరి వారిలో ఎవరిని సుకుమార్ ఫైనల్ చేస్తాడు అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube