నిర్భయ కేసులో దోషులకు అమలు కావాల్సిన ఉరిశిక్ష పై ఢిల్లీ పటియాలా కోర్టు స్టే విధించినట్లు తెలుస్తుంది.జనవరి 16 న నిర్భయ దోషులు ముకేశ్,వినయ్, పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ లకు ఫిబ్రవరి 1 వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరిశిక్షలను అమలు చేయాలి అంటూ పటియాలా కోర్టు తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే.
అయితే శిక్షాకాలం దగ్గరపడుతుండడం తో నిర్భయ దోషులు ఒక్కొక్కరూ ఒక్కోసారి పిటీషన్ లు దాఖలు చేస్తో కాలహరణం చేస్తూ వచ్చారు.దీనితో వారి ప్రయత్నాలు ఫలించి చివరికి వారి ఉరి పై స్టే లభించింది.2012 లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో దోషులుగా ఉన్న ఆ నలుగురి కి 7 సంవత్సరాల తరువాత శిక్షలు ఖరారు చేశారు.అయితే శిక్ష ఖరారు అయినప్పటి నుంచి కూడా దోషుల తరపు న్యాయవాది నిత్యం ఎదో ఒక పిటీషన్ తో కోర్టును ఆశ్రయిస్తూనే ఉన్నారు.
ఇప్పటికే ఒకసారి వాయిదా పడిన వారి శిక్షలు ఇప్పుడు తాజాగా పటియాలా కోర్టు స్టే విధించడం తో రెండో సారి వారి ఉరిశిక్ష వాయిదా పడింది.వినయ్ శర్మ క్షమాభిక్ష పిటీషన్ అలానే పవన్ గుప్తా రివ్యూ పిటీషన్ లు పెండింగ్ లో ఉండడం తో కోర్టు ఈ మేరకు తెలుస్తుంది.
దోషుల తరపున పిటీషన్ లు పెండింగ్ లో ఉన్నప్పుడు వారికి ఉరిశిక్షలు అమలు చేయకూడదు అంటూ జైలు అధికారులు కోర్టుకు తెలపడం తో వారి ఉరిశిక్ష వాయిదా పడినట్లు తెలుస్తుంది.మిగిలిన ఇద్దరూ కూడా పిటీషన్ దాఖలు చేసే వరకు వారి ఉరిశిక్షలను వాయిదా వేస్తారా లేదంటే పిటీషన్ లు కొట్టివేయగానే శిక్షలను అమలు పరుస్తారా అన్న సందిగ్ధత నెలకొంది.