మామూలుగా అభిమానులు తమ అభిమాన నటీనటులను చూడడానికి ఎగబడుతుంటారు.అంతేగాక ఒకవేళ వాళ్ళు ఎక్కడైనా సినీ ఫంక్షన్లకు కానీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమాలకి వెళితే తమ అభిమాన నటులను చూడడానికి వచ్చిన అభిమానులను కంట్రోల్ చేయడం వారి పక్కన ఉన్న వారి తరం కూడా కాదు.
అయితే తాజాగా గ్లామర్ క్వీన్ పూజా హెగ్డే ని కలవడానికి ఓ అభిమాని ఏకంగా తాను ఉన్నటువంటి ముంబై నగరానికి వెళ్ళి ఐదు రోజుల పాటు ఆమెను కలవడం కోసం ఫుట్ పాత్ మీద పడుకున్నాడు.
వివరాల్లోకి వెళితే భాస్కర రావు అనే వ్యక్తి ఇ అందాల నటి పూజా హెగ్డే కి వీరాభిమాని.
ఇందులో భాగంగా ఎప్పుడూ ఆమెను కలవాలని అంతేగాక ఆమెతో ముచ్చటించాలని అనుకుంటూ ఉండేవాడు.దాంతో ఎన్నో సార్లు ఆమెను కలవాలని ప్రయత్నించాడు.కానీ ఆమెను కలలేక పోయాడు.దీంతో తాజాగా పూజా హెగ్డే ఉన్నటువంటి ప్రాంతాన్ని కనుగొని ఆమెను కలవడానికి వెళ్ళాడు.
అయితే ఆమె కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు రోజులు నిరీక్షించాడు.కానీ ఆమె రాకపోయేసరికి నిరాశ చెందకుండా అలానే ఐదురోజులపాటు అక్కడే దొరికింది తింటూ ఫుట్ ఫాత్ పైన పడుకున్నాడు.
తీర ఐదు రోజులు తరువాత పూజా హెగ్డే రావడంతో ఆమెను కలిసి ఆమెతో మాట్లాడాడు.తను తెలుగులో నటిస్తున్నప్పటి నుంచి తనకు వీరాభిమానిగా మారిపోయానని అందువలన కలవడానికి ఇక్కడికి వచ్చానని గత ఐదు రోజులుగా ఇక్కడే ఉంటున్నాని అని చెప్పాడు.
భాస్కర్ రావు అభిమానానికి ఫిదా అయిపోయిన అటువంటి పూజా హెగ్డే అంతలా తనపై అభిమానం చూపిస్తున్న టువంటి భాస్కర్ రావుకి కృతజ్ఞతలు తెలిపింది అంతేకాక తన కోసం ఇలా ఇల్లు వదిలి రావద్దంటూ ఇంటిదగ్గర తనకోసం తన తల్లిదండ్రులు ఎదురుచూస్తూ ఉంటారు ఇప్పటికైనా ఇంటికి వెళ్లాలని సూచించింది.అంతేగాక తనని అంతగా ఆరాధిస్తున్న అతన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపింది.