బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా భారతీయుడు

బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా భారత సంతతి వ్యక్తి ఎన్నిక కావడం సంచలనం సృష్టించింది.ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, ఆర్ధిక మంత్రిగా ఎన్నికైన రిషి సునక్ స్వయానా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కి అల్లుడు.

 Indian Origin Rishi Sunak Tipped To Run Economic Super Ministry-TeluguStop.com

తాజాగా బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరుపున రిషి యార్క్షైర్ రీచ్మాండ్ నుంచీ గెలుపొందారు.రిషి బ్రిటన్ ప్రధాని బోరిస్ కాన్సన్ కి అత్యంత సన్నిహితుడు కావడం ఇక్కడ మరొక విశేషం.

బ్రిటన్ గత ప్రభుత్వంలో రిషి ఆర్ధిక ఉప మంత్రిగా భాద్యతలు నిర్వర్తించారు.ఈ క్రమంలోనే రిషి పనితీరు పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని బోరిస్ ఈ సారి ఏకంగా ఆర్ధిక మంత్రిగా అతిపెద్ద పదవిని కట్టబెట్టనున్నారట.

అంతేకాదు రిషికి స్థానికంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.అందుకే ఎన్నికల నేపధ్యంలో టీవీ చర్చల్లో సైతం రిషినే ఎక్కువగా పాల్గొనడం జరిగిందని తెలుస్తోంది.

బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా భారత�

ఫిబ్రవరి లో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ఈ పదవి ఆయనకు దక్కనుందని తెలుస్తోంది.రిషి ఇంగ్లాండ్ లోని కౌంటీలో జన్మించారు.అయితే రిషి ఎంపీగా రిచిమాండ్ నుంచీ ఎన్నిక కావడం వరుసగా ఇది మూడో సారి కావడం మరొక విశేషం.గతంలో ధెరిసా మే ప్రభుత్వంలో సైతం రిషి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.

దాంతో ఈ ప్రభుత్వంలో సైతం రిషికి కీలక బాధ్యతలు కట్టబెట్టారు బోరిస్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube