టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలకు అవాంతరం కలిగిస్తున్నారంటూ స్పీకర్‌ తమ్మినేని తొమ్మిది మంది ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తున్నట్లుగా ప్రకటించాడు.ఎమ్మెల్యేల సస్పెండ్‌ తో తెలుగు దేశం పార్టీ తీవ్ర స్థాయిలో మండి పడింది.

 Tamineni Sitharam Tdp Chandrababu Naidu-TeluguStop.com

ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడటంకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత ఒకరు మాట్లాడుతూ నిజాలు బయట పడతాయనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారంటూ ఎద్దేవ చేశాడు.

రాజధాని విషయంలో నేడు అసెంబ్లీలో చర్చ జరిగింది.ఈ సందర్బంగా తెలుగు దేశం సభ్యులు సభలో పలు ప్రశ్నలు ఉంచగా వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పలేదు అంటూ ఆందోళనకు దిగారు.

సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం వారిని సస్పెండ్‌ చేయాల్సిందిగా స్పీకర్‌ కు రిఫర్‌ చేయడం స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం జరిగింది.సస్పెండ్‌ అయిన ఎమ్మెల్యేలో నిమ్మల రామానాయుడు, అచ్చెనాయుడు, రామకృష్ణ బాబు, బెదాళం అశోక్‌, వీరాంజనేయస్వామి, మద్దాల గిరి, సత్యప్రసాద్‌, ఏలూరి సాంబశివరావు, గద్దె రామ్మోహన్‌లు ఉన్నారు.

వీరిని నేడు ఒక్క రోజుకు సస్పెండ్‌ చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube