జగన్‌ రాజధానులపై బీజేపీ ఏమంటోంది

ఏపీ సీఎం జగన్‌ నిన్న అసెంబ్లీలో రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అన్నట్లుగా మాట్లాడిన విషయం తెల్సిందే.

రాయలసీ మరియు ఆంధ్రా ప్రాంతాల్లో సమంగా అభివృద్ది జరగాలంటే రాజధానులు మూడు ఉండాల్సిందే అంటూ ఈ సందర్బంగా జగన్‌ చెప్పుకొచ్చాడు.

అసెంబ్లీలో జగన్‌ చేసిన రాజధాని ప్రకటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.రాజధానుల విషయంలో బీజేపీ స్పందన కూడా వైకాపాకు మద్దతుగా ఉంది.

జగన్‌ చేసిన ప్రకటనపై కన్నా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ తమ మ్యానిఫెస్టోలోనే రాజధానుల విషయమై క్లారిటీగా చెప్పాం.మూడు రాజధానులకు బీజేపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఈ సందర్బంగా అన్నాడు.

అయితే అమరావతిని తక్కువ చేయడం మంచిది కాదని మాత్రం ఆయన అన్నాడు.అమరావతిని కీలకంగా చేస్తూ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా రాజధాని ఏర్పాటు చేయాలంటూ కన్నా సూచించాడు.

Advertisement
కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!

తాజా వార్తలు