ధూమ్ సినిమా స్టైల్ లో దోపిడీ... ఏకంగా 7800 కోట్లు

ధూమ్ సినిమా చూసిన వారికి భారీ దొంగతనాలు ఎలా జరుగుతాయో తెలుస్తుంది.అయితే పెద్ద పెద్ద సెక్యూరిటీ ఉండే చోట దొంగతనాలు చేయాలంటే ఆ స్థాయిలో రిస్క్ చేయాల్సిందే అని అందరూ అనుకుంటారు.

 Real Happend Like Dhoom Movie-TeluguStop.com

  చిన్న  చిన్న దొంగతనాలకు రిస్క్ చేస్తున్న ఈ రోజుల్లో అసలు భారీ దొంగతనాలు గురించి ఆలోచన కూడా చేయరు.కానీ  విదేశాలలో మాత్రం భారీ దొంగతనాలని చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు.

టెక్నాలజీ వచ్చిన తర్వాత కొన్ని చోట్ల దొంగతనాలని సులభంగా చేసేస్తున్నారు.ఇప్పుడు అలాంటి సంఘటన జర్మనీలో జరిగింది.

ఇద్దరు దొంగలు ఓ మ్యూజియం లో ఏకంగా 7800 కోట్ల విలువ చేసే ఆభరణాలు ఎత్తుకుపోయారు. జర్మనీ డ్రెస్డన్ మ్యూజియంలో గ్రీన్ వాలెట్ భవనంలో ఈ సంఘటన జరిగింది.

భవనానికి విద్యుత్ సరఫరా కట్ చేసి ఈ దోపిడీకి పాల్పడ్డారు.దోచుకున్న సొత్తుతో దర్జాగా ఆడీకారులో ఉడాయించారు.కొన్ని వందల ఏళ్ల నాటి నగలు చోరీకి గురయ్యాయని అక్కడి పోలీసులు భావిస్తున్నారు.జర్మనీలోనే అత్యంత పురాతనమైన, అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన మ్యూజియంలో ఈ చోరీ జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

  సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు.  రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఒకసారి రష్యాకు చెందిన రెడ్ ఆర్మీ ఈ మ్యూజియాన్ని దోచుకుంది.2000 సంవత్సరంలో ఆ సొమ్మును జర్మనీకి తిరిగొచ్చింది.మరల అదే స్థాయిలో  జరగడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube