ఫైనల్ జడ్జిమెంట్: అయోధ్య స్థలం వారిదే !

చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన అయోధ్య రామ మందిర నిర్మాణ స్థలం పై ఎట్టకేలకు సుప్రీమ్ కోర్టు కీలక తీర్పు నేడు ఇచ్చింది.దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఈ వివాదంపై సుప్రీం ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ ఇప్పటివరకు అందరిలోనూ కనిపించింది.అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై హిందూ, ముస్లిం ల మధ్య దశాబ్దాలుగా వివాదం నెలకొంది.గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి.వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువుల కే చెందుతుందని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది.

 Latest Update Of Ayyodya Ramamandir Place-TeluguStop.com

వివాదాస్పద స్థలానికి సంబంధించి మూడు నెలల్లో కేంద్రం ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలంటూ ధర్మాసనం ఆదేశించింది.

Telugu Judgeranjan, Latestayyodya, Judges, Suprimannounce-

మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలో ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది.మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదు ఎకరాల స్థలం కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది.రాజకీయాలు, చరిత్రలకు అతీతంగా న్యాయం నిలబడాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా సూచనలు చేసింది.

ముందుగా తీర్పు పాఠాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చదివారు.నిర్ణయానికి ముందు రెండు మతాలను విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నట్టు గా ఆయన చెప్పారు.

పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా తీర్పు వెలువరిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందినదని, వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కు కోరలేదని స్పష్టం చేశారు.

Telugu Judgeranjan, Latestayyodya, Judges, Suprimannounce-

ప్రార్థనా మందిరాల చట్టం ప్రాథమిక విలువలు, మత సామరస్యాన్ని పరిరక్షిస్తుందని ఆయన తీర్పులో వెల్లడించారు.వివాదాస్పద స్థలంలో మందిరం ఉన్నట్టు పురావస్తు శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు.మసీదు నిర్మాణానికి ముందే ఆ స్థలంలో ఒక నిర్మాణం ఉందన్నారు.వివాదాస్పద స్థలంలో మసీదు లేదని, అక్కడ హిందూ నిర్మాణం ఉందని పురావస్తు శాఖ విభాగం చెబుతోందన్నారు.

యాజమాన్య హక్కులనేవి నిర్దేశిత న్యాయసూత్రాల ఆధారంగా నిర్ణయిస్తామన్నారు.అయోధ్యను రామ జన్మభూమిగా హిందువులు విశ్వసిస్తారని, మందిరాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని పురావస్తు శాఖ ఎక్కడా చెప్పలేదన్నారు.

రాముడు అయోధ్యలో జన్మించాడన్నది నిర్వివాదాంశమన్నారు.మసీదు ఎవరు కట్టారో, ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పిన విషయాన్ని న్యామూర్తి గుర్తు చేశారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube