తనను నచ్చిన.తాను మెచ్చిన అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తూ, ఆమెతో సహజీవనం చేస్తోన్న ఓ యువకుడికి చెడు బుద్ది పుట్టింది.
దీంతో అతడు చేసిన పనికి ఆ యువితో సంబంధం చెడటమే కాకుండా అతడిని జైలుపాలు చేసిన ఘటన అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది.ఇంతకీ ఆ ప్రబుద్ధుడు ఏం చేశాడనేగా మీ సందేహం.
అయితే ఈ వార్త చదవాల్సిందే.
అహ్మదాబాద్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన మేహుల్ జోషీ(23) ఒక అమ్మాయితో సహజీవనం కొనసాగిస్తున్నాడు.
అయితే తన ప్రేయసికి తనపై ఎంత ప్రేమ ఉందో తెలియాలనే ఆలోచన మేహుల్ మదిలో మెదిలింది.దీంతో అతడో వింత ఆలోచన చేశాడు.
రోజూలాగే తాను ఆఫీసుకు వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు.తన ఫోన్‌లోని సిమ్ కార్డు మార్చి వేరే సిమ్ కార్డుతో తన ప్రేయసికి ఫోన్ చేశాడు.
తన ప్రియుడిని కిడ్నాప్ చేశానని.అతడిని కాపాడాలంటే వెంటనే తనకు మూడు లక్షల రూపాయలు అప్పజెప్పాలని బెదిరించాడు.
దీంతో ఆ యువతి వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో వారు ఆమె ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేశారు.నిందుతుడు గాంధీధామ్‌లోని ఓ లాడ్జీలో ఉన్నాడని తెలుసుకుని అతడికోసం గాలించారు.
పోలీసులను చూసిన మేహుల్ పరుగు లంకించుకున్నాడు.ఎట్టకేలకు అతడిని స్థానిక బస్టాండ్‌లో పోలీసులు పట్టుకుని తమదైన రీతిలో విచారణ చేపట్టగా.
తన ప్రేయసి ప్రేమకు పరీక్ష పెట్టానని చెప్పాడు ఆ ఘనుడు.దీంతో పోలీసులు అతడిని శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపించారు.
తన ప్రేయసికి తనపై ఎంత ప్రేమ ఉందని తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఆ ప్రియుడికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు.