ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు మరి కొన్ని డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంటలు ఇప్పటికీ చల్లారలేదు.అది చిలికిచిలికి గాలి వానలా మారి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మధ్య మంట పెట్టేలా కనిపిస్తోంది.
ఏపీలో అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ జగన్ ముందుకు దూసుకు పోతున్నారు.దానిలో భాగంగానే ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం అంటూ ప్రకటించారు.
ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగానే గుర్తిస్తామన్నారు.దీంతో ఆర్టీసీ కార్మికుల్లో ఎక్కడ లేని ఆనందం కనిపించింది.
అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం చేసిన విధంగానే తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు.తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె పై కెసిఆర్ మొండి వైఖరిని అవలంబించడం తో సమ్మెకు పరిష్కారం లభించలేదు.
అయితే ఈ విషయంలో లో హైకోర్ట్ జోక్యం చేసుకోవడంతో కేసీఆర్ కాస్త మెత్తబడ్డారు.ఈ సందర్భంగా ఆర్టీసీపై జగన్ నిర్ణయం చర్చకు రాగా ఏపీలో ఆర్టీసీ విలీనం అవ్వలేదని, జగన్ ప్రభుత్వం కేవలం కమిటీ మాత్రం వేసిందని, ఏపీ లో ఏం జరుగుతుందో ఆ దేవుడికి తెలియాలి అంటూ కెసిఆర్ కాస్త వెటకారంగా స్పందించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరగని పని, అసలు ఆ డిమాండ్ అసంబద్ధమైనదని కేసీఆర్ విమర్శించారు.ఏపీలో ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన జగన్ దీనిపై కమిటీ మాత్రమే వేశారని, ఆ కమిటీ మూడు నెలలకో ఆరు నెలలకో ఏదో కథ చెబుతారు అంటూ విమర్శలు చేశారు.సీఎం జగన్ జగన్ సంగతి నేను చెబుతున్నాను జగన్ అక్కడ ఓ ప్రయోగం మాత్రమే చేశారని, 100% ఆర్టీసీ విలీనం చేయడం అసాధ్యం, అసంభవం ఈ భూగోళం ఉన్నంతవరకు అది జరిగేది కాదు అంటూ కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు.ఆర్టీసీ పై కెసిఆర్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న జగన్ ఆర్టీసీ విలీన ప్రక్రియ ను వేగవంతం చేసేలా ఓ కమిటీని నియమించారు.
ఆర్టీసీ విలీన ప్రక్రియ పూర్తి చేసేందుకు వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశారు.ఏడుగురు సభ్యులతో వర్కింగ్ గ్రూప్ ను నియమిస్తూ జీవో జారీ చేశారు.వచ్చే నెల 15లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
తాము ప్రతి విషయంలో చిత్తశుద్ధి గా ముందుకు వెళుతుంటే కేసీఆర్ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించడం జగన్ కు ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది.అందుకే వెంటనే వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు.ఏపీలో ప్రత్యేకంగా ప్రజా రవాణా విభాగం ఏర్పాటు చేసి అందులో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయబోతున్నారు.
అంటే ఆర్టిసి అలాగే ఉంటుంది.ఉద్యోగులు ఆర్టీసీ కే పని చేస్తారు.
కానీ జీతాలు మాత్రం ఆర్టీసీ చెల్లించదు.ఆర్టీసీ ని సాంకేతికంగా ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యం అందుకే ఉద్యోగులను విలీనం చేసి జీతభత్యాల ఖర్చు భరించడం మినహా మరో మార్గం లేదని జగన్ భావిస్తున్నారు.