న్యూ డైరక్టర్ తో మెగాహీరో.. రిస్క్ చేస్తున్నాడా?

మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్ మరో కొత్త ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.సింగిల్ సిట్టింగ్ లో స్క్రిప్ట్ విని ఒకే చేసిన సాయి ఆ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తేవడానికి ప్రయత్నిస్తున్నాడు.

 Sai Dharamtej Differentmovie With Newdirector-TeluguStop.com

ఉయ్యాలా జంపాల – మజ్ను సినిమాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ సహాయ దర్శకుడిగా పని చేసిన సుబ్బు సాయితో వర్క్ చేయబోతున్నాడట.

న్యూ డైరక్టర్ తో మెగాహీరో రి

నాన్నకు ప్రేమతో – తొలిప్రేమ – మిస్టర్ మజ్ను వంటి సినిమాలని నిర్మించిన సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ కొత్త ప్రాజెక్ట్ ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ మారుతి డైరెక్షన్ లో ప్రతి రోజు పండగే అనే సినిమాలో నటిస్తున్నాడు.

కొన్ని నెలల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లో పూర్తి కానుంది.

ఈ ప్రాజెక్ట్ అనంతరం సుబ్బు డైరెక్షన్ లో ఒక డిఫరెంట్ మోడ్రన్ స్క్రిప్ట్ లో సాయి నటించనున్నట్లు తెలుస్తోంది.

కొత్త దర్శకుడి కథను చెప్పిన విధానం అలాగే స్క్రీన్ ప్లే కూడా కొత్తగా అనిపించడంతో సాయి సింగిల్ సిట్టింగ్ లో సినిమాను చేయడానికి ఒప్పుకున్నాడట.మొన్నటివరకు సక్సెస్ లేక సతమతమైన సాయి ఇప్పుడు కొత్త దర్శకుడితో రిస్క్ చేస్తున్నాడా అనే టాక్ వస్తోంది.

అలాగే వేరే దర్శకులు చెప్పిన మరో రెండు కథలకు కూడా ఈ మెగా హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube