గజ్జి తగ్గేలా మందులు ఇవ్వలేదని కోపంతో ఆ పేషంట్‌ ఏం చేశాడో తెలిస్తే డాక్టర్ల వెన్నులో వణుకు ఖాయం

ఈ ప్రపంచంలో డాక్టర్‌ కు అత్యంత గౌరవ మర్యాదలు దక్కుతాయి.ఎందుకంటే దేవుడు ప్రాణం పోస్తే దాన్ని ఆపద సమయంలో కాపాడగలిగేది కేవలం డాక్టర్‌ మాత్రమే.

 Man Stabs Doctors Wife To Daparture Injures Son-TeluguStop.com

అందుకే డాక్టర్‌ను మరో దేవుడు అని, దేవుడికి ప్రతి రూపం అన్నట్లుగా అభివర్ణిస్తూ ఉంటారు.దేవుడు అంతట ఉండలేక డాక్టర్లను ఏర్పాటు చేశాడు అనేది కొందరి మాట.అలాంటి డాక్టర్‌ను ఒక పేషంట్‌ చంపేయాలని చూడటం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.డాక్టర్‌ ను చంపాలనుకుని ఆయన కనిపించక పోవడంతో డాక్టర్‌ భార్యను మరియు కొడుకును కత్తితో పొడవటం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… మద్య ప్రదేశ్‌కు చెందిన రఫిక్‌ అనే వ్యక్తి చాలా నెలలుగా చర్మ సంబంధిత వ్యాదితో బాధపడుతున్నాడు.అతడి చర్మ సమస్య కారణంగా పదే పదే గోకుడు పెట్టడం జరుగుతుంది.

పచ్చిగా చెప్పాలంటే అతడికి ఒల్లంతా గజ్జి ఉంటుంది.ఆ గజ్జికి మందులు వాడుతున్న అతడికి సాంత్వన లభించలేదు.

నాలుగు నెలల పాటు ఒక డాక్టర్‌ వద్ద రఫీక్‌ చికిత్స తీసుకుంటున్నాడు.నాలుగు నెలలు అయినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది.

దాంతో అతడి ఆగ్రహం కట్టలు తెంచుకుని హాస్పిటల్‌కు వెళ్లాడు.

గజ్జి తగ్గేలా మందులు ఇవ్వలేద�

హాస్పిటల్‌ వద్ద నానా రబస చేశాడు.స్థానికులు మరియు సిబ్బంది ఎంత చెప్పినా వినకుండా డాక్టర్‌ రావాల్సిందే అంటూ మొండి పట్టు పట్టాడు.డాక్టర్‌ లేడని తర్వాత రావాల్సిందిగా డాక్టర్‌ భార్య చెప్పడం జరిగింది.

ఆమె సమాధానంకు సంతృప్తి చెందని రఫీక్‌ మరింత కోపంతో ఊగిపోయి తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచాడు.ఆ సమయంలోనే డాక్టర్‌ కొడుకు కూడా అక్కడకు రావడంతో అతడిని కూడా పొడిచేశాడు.

దాంతో డాక్టర్‌ భార్య అక్కడిక్కడే మృతి చెందింది.ఇక డాక్టర్‌ కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube