వామ్మో తనను అంతా మంచోడు అనుకోవాలని 100 మంది ప్రాణాలు తీసిన సైకో నర్స్‌

కొందరికి కొన్ని వీక్‌నెస్‌లు ఉంటాయి.ఏదో సినిమాలో ఒకడు తనకు పరీక్షల్లో మంచి మార్కులు రావడం లేదు అంటూ పిచ్చోడు అవుతాడు.

 German Nurse Accused Of Wipe Out 100 Patients Apologizes To Families-TeluguStop.com

ఎప్పుడు ఫస్ట్‌ వచ్చే అతడు, ఒకటి రెండు సార్లు సెకండ్‌ ఆ తర్వాత స్థానాలు రావడంతో అసంతృప్తితో సైకోగా మారతాడు.ఇప్పుడు నేను చెప్పబోతున్న వ్యక్తి కూడా ఇలాంటి వాడే.

అయితే వీడు మరీ దారుణంగా ప్రవర్తించాడు.తనను అంతా మంచి వాడు అనుకోవాలని వీడికి పిచ్చి.

అందరు నన్ను మెచ్చుకోవాలి, అందరు నన్ను గౌరవించి వావ్‌ అనిపించుకోవాలనేది వీడి పిచ్చి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

జర్మనీకి చెందిన నెయిల్స్‌ హోజల్‌ ఒక ప్రముఖ హాస్పిటల్‌లో మెయినల్‌ నర్స్‌గా జాబ్‌ చేస్తున్నాడు.ఇతడు చాలా కాలంగా హాస్పిటల్‌లో అందరితో మంచోడని, రోగులకు మంచి వైధ్యం అందిస్తాడని పేరు తెచ్చుకున్నాడు.

డాక్టర్లు కూడా క్యూర్‌ చేయలేని సమస్యలను ఇతడు క్యూర్‌ చేయగలడు అంటూ పేరు తెచ్చుకున్నాడు.ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఇతడు బతికించడం కొన్ని సార్లు డాక్టర్లకు కూడా ఆశ్చర్యం కలిగించింది.

అయితే అది అంతా అతడి ప్లాన్‌ అంటూ ఇప్పుడు తెలిసింది.

వామ్మో తనను అంతా మంచోడు అనుకో

ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు, రోగాల కారణంగా హాస్పిటల్‌లో జాయిన్‌ అయిన వారికి విషపు ఇంజక్షన్‌ ఇచ్చి వారి ఆరోగ్యం క్షీణించేలా చేస్తాడు.ఆ తర్వాత వారికి చికిత్స చేసి వారిని బతికించినట్లుగా బిల్డప్‌ ఇస్తాడు.వారి పరిస్థితి ఆందోళనకరంగా మారిన సమయంలో రంగంలోకి దిగి అతడు ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం, తోటి నర్స్‌ లు అతడిని మెచ్చుకోవడం చేస్తారు.

అది అతడికి వ్యసనంగా మారి వందలాది మందికి విషపు ఇంజక్షన్‌ చేశాడు.అందులో చాలా మంది మృతి చెందారు.వారిని బాగు చేయడం అతడి వల్ల కాకపోవడంతో చేతులు ఎత్తేశాడు.

దాదాపు 200 మంది ఇతడి విషపు ఇంజక్షన్‌ వల్ల మృతి చెంది ఉంటారు అనేది ఒక అంచనా.

ప్రస్తుతం ఇతడిని విచారిస్తున్న పోలీసులకు ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి.హాస్పిటల్‌లో ఉండే లేడీ నర్స్‌ల వద్ద మంచి పేరు తెచ్చుకుని, వారిని తన చుట్టు తిప్పుకుంటూ ట్రీట్‌ మెంట్‌ నేర్పించేవాడని, అతడు అమ్మాయిల వద్ద హీరో అవ్వాలనే ఉద్దేశ్యంతో ఇలా చేశాడని పోలీసులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube