తెలంగాణ సీఎం కేసీఆర్ కు ముహూర్తాల సెంటిమెంట్ బాగా ఎక్కువ అందుకే తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు… వచ్చి 20 రోజులు దాటిపోయినా తన మంత్రిమండలి విస్తరణకు మొగ్గుచూపడంలేదు.అయితే సంక్రాంతికి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనుకుని కొత్త గెలిచిన కొంతమంది ఆశావాహులు… గత క్యాబినెట్ లోని మంత్రులు ఆశలుపెట్టుకుని ఎదురుచూస్తుంటే వారి ఆశల మీద ఎన్నికల కమిషన్ నీళ్లు చల్లింది.
గ్రామ పంచాయితీ ఎన్నికలు నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో… కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడేలా చేశాయి.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన ప్రమాణస్వీకారం చేశారు.
ఈ ప్రమాణం తనతో పాటు మహమూద్ అలీతో ేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకొన్నారు.మహమూద్ అలీకి హోం మంత్రిత్వశాఖను కట్టబెట్టారు.
అయితే రాష్ట్రంలో మూడు విడతల్లో గ్రామ పంచాయితీ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు జనవరి 1వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
కేబినెట్ విస్తరణ కూడ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.కేబినెట్‌లో బెర్త్ కోసం ఎదురు చూస్తున్న నేతలకు ఎన్నికల కోడ్ పెద్ద షాక్ ఇచ్చినట్టు అయ్యింది.