మెరిసే చ‌ర్మం కోసం మామిడి పండు.. స‌మ్మ‌ర్‌లో ఈ ఫేస్ ప్యాక్ త‌ప్ప‌క ట్రై చేయండి!

ప్రస్తుత వేసవి కాలంలో విరివిరిగా లభ్యమయ్యే పండ్లలో మామిడి పండ్లు( Mangoes ) అగ్రస్థానంలో ఉంటాయి.సమ్మర్ సీజన్ మామిడి పండ్ల సీజన్ అని కూడా పిలుస్తారు.

 Try This Mango Face Pack For Glowing Skin In Summer! Mango Face Pack, Glowing Sk-TeluguStop.com

ఎంతో రుచికరంగా ఉండే మామిడి పండ్లను పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.అలాగే ఆరోగ్యపరంగా మామిడి పండ్లు ఎంతో మేలు చేస్తాయి.

అంతేకాదు చర్మ సౌందర్యాన్ని పెంచడానికి కూడా మామిడి పండ్లు తోడ్పడతాయి.ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ లో మెరిసే అందమైన చర్మాన్ని కోరుకునేవారు ఇప్పుడు చెప్పబోయే మ్యాంగో ఫేస్ ప్యాక్ ను తప్పక ట్రై చేయండి.

Telugu Tips, Face Pack, Skin, Latest, Mango, Mango Benefits, Mango Face Pack, Sk

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia Seeds: ) వేసి కొద్దిగా వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్ ను వేసుకోవాలి.అలాగే కొన్ని తొక్క తొలగించిన మామిడి పండు ముక్కలు వేసుకుని స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీలో వన్ టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Telugu Tips, Face Pack, Skin, Latest, Mango, Mango Benefits, Mango Face Pack, Sk

రెండు రోజుల‌కు ఒక‌సారి ఈ మ్యాంగో మాస్క్‌ వేసుకుంటే అనేక లాభాలు మీ సొంతం అవుతాయి.మామిడి పండ్లలో విటమిన్ సి( Vitamin C అధికంగా ఉంటుంది.ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో మరియు ప్రకాశవంతంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది.మామిడి పండ్ల‌లో ఉండే విటమిన్లు, బీటా-కెరోటిన్ లు చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి.డార్క్ స్పాట్స్ ను క్ర‌మంగా మాయం చేస్తాయి.స్కిన్ టోన్‌ను ఇంప్రూవ్ చేస్తాయి.

మ‌రియు స్కిన్‌ను హైడ్రేటెడ్‌గా సైతం ఉంచుతాయి.అలాగే చియా సీడ్స్ లో ఉండే అధిక స్థాయి యాంటీఆక్సిడెంట్లు యూవీ ఎక్స్పోజర్ వల్ల కలిగే ఫ్రీ రాడికల్ నష్టంతో పోరాడటానికి సహాయపడతాయి.

చ‌ర్మాన్ని స్మూత్‌గా, షైనీగా మారుస్తాయి.ఇక పెరుగు యొక్క లాక్టిక్ యాసిడ్ చ‌ర్మంపై పేరుకుపోయిన మృత కణాలను సున్నితంగా తొలగిస్తుంది.

చ‌ర్మ రంధ్రాలను అన్‌క్లాగ్ చేస్తుంది.మొటిమలను తగ్గిస్తుంది.

చ‌ర్మాన్ని మృదువుగా సైతం మారుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube